👉ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి !
J.SURENDER KUMAR,
అక్రమ కట్టడాల కూల్చివేతపై ప్రభుత్వ నిర్ణయాన్ని చర్యలు సమంజసమే అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అన్నారు. అట్టి చర్యలు అభినందనీయమని, హర్ష వ్యక్తం చేశారు.
జగిత్యాల స్థానిక ఇందిరా భవన్ లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.
.👉అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేరువులపైన నిర్మించిన అక్రమ కట్టడాలపై మరియు ఇతర అక్రమ కట్టడాలపై ఏ విధంగా ముందుకు వెళ్లలి అని ఒక అంశాన్ని ప్రవేశ పెట్టారు
👉దీని పైన అధికార పార్టీ సభ్యులు ప్రతిపక్ష సభ్యులు చర్చించడం జరిగింది
👉చెరువుల పైన, బఫర్ జొన్ లో నిర్మించిన అక్రమ కట్టడాల నిర్మాణాల కూల్చివేత చేపట్టలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు హర్షిస్తున్నారు
👉హైదరాబాద్ లోని నక్లెస్ రోడ్డు లో ఉన్న అక్రమ కట్టడాలను, మరియు జిల్లాలలో కూడా ఉన్న అక్రమ కట్టడాలను జిల్లా కలెక్టర్,ఎస్పీ ల అద్వర్యంలో కూల్చివేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని సిఎం ను కోరుతున్నాం..
👉ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే శాసన సభ్యులతో చర్చిన తర్వాత వారి ఆమోదంతోనె తీసుకుంటుంది..అంతే గాని వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోలేదు.

👉దీని పైన ప్రతిపక్షాలు ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయి,వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం
👉అక్రమ కట్టడాల కూల్చివేతపై ప్రభుత్వ నిర్ణయాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నేతృత్వంలో మేము అందరం అభినందిస్తున్నాం, హర్షిస్తున్నం