J.SURENDER KUMAR,
అంకితభావంతో పనిచేస్తే ప్రతి ఒక్క ఉద్యోగికి గుర్తింపు లభిస్తుందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మపురి 108 అంబులెన్స్ లో ఉత్తమ సేవలు అందించినందుకు గాను ఉత్తమ పౌర సేవా పురస్కారాన్ని గురువారం జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన 78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో 108 ఉద్యోగులు బత్తిని సంపత్, అనిల్ కుమార్ లకు ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ పౌర సేవా పురస్కారాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి అంకితభావంతో పనిచేస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు ప్రజల ముంగిట్లో చేరేలా పనిచేయాలని సూచించారు.