J.SURENDER KUMAR,
ఆ ప్రాంతం జాతీయ రహదారి చౌరస్తా ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధి రాయపట్నం. ఓ చిరు ఉద్యోగి అర్ధరాత్రి అప్రమత్తంగా విధులు నిర్వహిస్తూ ఓ నిండు ప్రాణాలు కాపాడిన వైనం ఇది.
రాయపట్నం చౌరస్తాకు ఫర్లాంగ్ దూరంలో ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లా సరిహద్దు గోదావరి నది వంతెన ఉంది. సునీతమైన ఈ ప్రాంతంలో గత సంవత్సర ప్రత్యేక పోలీస్ అవుట్ పోస్టు ఏర్పాటు చేశారు. సమయానుకూలంగా పోలీసుల తనిఖీలు అక్కడ చేపడుతున్నారు.
అవుట్ పోస్టు స్వచ్ఛతను, సీసీ కెమెరాల పర్యవేక్షణ కు ఓ చిరు ఉద్యోగిని (పోలీస్ సెక్యూరిటీ) సిబ్బంది నియమించుకున్నారు. రాత్రివేళలో ఆ ఉద్యోగి గోదావరి నది వంతెన పోలీస్ అవుట్ పోస్టు వరకు తిరుగుతుంటాడు. సోమవారం రాత్రి అనుమానస్పదం గా సంచరిస్తున్న ఓ వ్యక్తి కదలికలను గుర్తించి పట్టుకొని అతని ప్రాణాలు కాపాడిన వైనం ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే..
మద్దుల పల్లెకు చెందిన వెంగల రాజయ్య (71)
ఆదివారం 18న ఇంటినుండి వెళ్ళిపోయాడు. రాయపట్నం లో రాత్రి గోదావరి నదిపై సోమవారం అనుమానస్పదంగా సంచరిస్తూ కంది మల్లేష్ కు ( పోలీస్ అవుట్ పోస్ట్ చిరు ఉద్యోగి ) కనిపించాడు. రాజయ్య కదలికలను పసికట్టి మల్లేష్. రాజయ్యను పట్టుకొని ధర్మపురి పోలీస్ స్టేషన్ కు అప్పగించాడు. పోలీసులు అతడి భార్యకు సమాచారం ఇచ్చి వెంగల రాజయ్య ను మంగళవారం ఉదయం అతడి ఆమెకు అప్పగించారు.