అర్హత ఉన్న అందరికీ కల్యాణ లక్ష్మి చెక్కులు ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,


అర్హత ఉన్న అందరికీ కళ్యాణ లక్ష్మి చెక్కులను అందిస్తామని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఏ. లక్ష్మణ్ కుమార్ అన్నారు.
గొల్లపెల్లి మండల కేంద్రంలోనీ స్థానిక వైశ్య భవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మీ మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పంపిణీ చేశారు.


ఈ సందర్భంగా మండలానికి చెందిన ₹ 5 లక్షల విలువ గల 5 కళ్యాణ లక్ష్మీ చెక్కులను అర్హులైన లబ్ధదారులకు పంపిణీ చేశారు. అనంతరం ₹ 48 లక్షల 46 వేల రూపాయల విలువ గల 216 CMRF చెక్కులను అర్హులైన లబ్ధదారులకు పంపిణీ చేశారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.


కళ్యాణ లక్ష్మీ చెక్కులు వచ్చిన ప్రతి లబ్దిదారుడికి శుభాకాంక్షలు తెలుపుతున్నామని, ఈ విడితలో CMRF, కల్యాణ లక్ష్మీ చెక్కులు రాని వారు ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదని, గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్నప్పటికీ కొంత మందికి చెక్కులు రాలేదని, వారికి కూడా చెక్కులు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు