👉 వినియోగదారుడికి బీమా సొమ్ము చెల్లించాలని తీర్పు !
J.SURENDER KUMAR,
వినియోగదారులతో ఆరోగ్య బీమా కంపెనీ అధికారులు అనారోగ్య చర్యలకు పాల్పడితే, వినియోగదారుల ఫోరం ఆరోగ్య భీమా కంపెనీ అనారోగ్య చర్యలకు వైద్యం చేసి సంచలన తీర్పు ఇచ్చి వినియోదారుడికి న్యాయం చేసింది.
👉వివరాలు ఇలా ఉన్నాయి..
జగిత్యాల పట్టణం కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కొత్త ప్రతాప్, ప్రభుత్వ రంగ భీమా కంపెనీ నుండి ఆరోగ్య భీమా పాలసీని, 31-3-2017 నుంచి 30-3-2018 వరకు తీసుకున్నాడు. తనకు, తన భార్య కు ఆరోగ్య బీమా వర్తించేలా పాలసీ తీసుకున్నాడు. దీనికి మెడికల్ ఖర్చుల కై కంపెనీ వారు ₹ 4,00,000/- తనకు, మరియు తన భార్య కు ₹ 3,50,000/- చెల్లించేలా పాలసీ లో పేర్కొనబడింది.
పాలసీ మనుగడలో ఉండగా తను వ్యాపారవేత్త కొత్త ప్రతాప్, కిమ్స్ సికింద్రాబాద్ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స చేయిన్చుకొన్నాడు. దీనికి ఆసుపత్రిలో బిల్ ₹ 2,90,999/- కాగా అట్టి మొత్తం డబ్బులు చెల్లించి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినాడు . దీనిపై భీమా కంపెనీ వారికి వారికీ ఆసుపత్రి బిల్లులను తన క్లెయిమ్ కోసం సమర్పించాడు. భీమా కంపెనీ వారు ₹ 1,40,000 /- మాత్రమే వినియోగదారుడు కొత్త ప్రతాప్ కు చెల్లించారు. మిగితా రూపాయల గూర్చి బీమా కంపెనీ వాళ్ళని అడగగా వారు చెల్లించడానికి నిరాకరించారు.

న్యాయం కోసం కొత్త ప్రతాప్, జగిత్యాలో ప్రముఖ న్యాయవాది మెట్ట మహేందర్ ను సంప్రదించడు . వినియోదరుల ఫోరం కరీంనగర్ లో 13-4-2018 న కేసు వేయగ అట్టిదానిని పరిశీలించి తేధీ 30-7-2024 న భీమా కంపెనీ మిగిత ₹1,40,000/- 9% వడ్డీతో తేది 13-4-2018 నుండి వినియోగదారుడికి డబ్బు చెల్లించే వరకు ఇవ్వాలని మరియు ఖర్చుల కోసం మరో ₹ 5,000/- ఇవ్వాలని శ్రీమతి శ్రీలత, మరియు శ్రీ నరసింహారావు సభ్యులు జిల్లా ఫోరం కరీంనగర్. వారు తీర్పునిచ్చారు.