తిరుమలలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆగస్టు 18న జరగాల్సిన శ్రీవారి ఆర్జిత కల్యాణోత్సవాన్ని టీటీడీ రద్దు చేసింది.
ఆగస్టు 15 నుంచి 17 వరకు శ్రీవారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు జరగనున్నాయి.
ఈ సందర్భంగా ఆగస్టు 17వ తేదీ రాత్రి వరకు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో వైదిక కార్యక్రమాలు జరగనున్నాయి.
దీంతో ఆగస్టు 18న జరగాల్సిన ఆర్జిత కల్యాణోత్సవాన్ని టీటీడీ రద్దు చేసిందని భక్తులు ఇట్టి విషయాన్ని గమనించగలరని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటనలో పేర్కొన్నారు.