J.SURENDER KUMAR,
మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు బుధవారం మంథని మండలం వెంకటాపూర్ గ్రామం లో మాజీ సర్పంచ్ అక్కపాక సమ్మయ్య మరియు చిట్యాల శంకర్ లు ఇటీవల అనారోగ్య కారణంగా మరణించగ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు.

👉తాజా మాజీ సర్పంచ్ భౌతిక కాయానికి నివాళులర్పించిన మంత్రి !

మంథని మండలంలోని గుమ్మునూరు గ్రామ తాజా మాజీ సర్పంచ్ బందెల రామస్వామి అనారోగ్యంతో మంగళవారం రాత్రి మరణించగా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు బుధవారం ఉదయం లక్ష్మీపూర్ లోని వారి స్వగృహానికి వెళ్లి రామస్వామి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.

అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి అండగా ఉంటామని తెలిపారు.
👉మంథని పట్టణంలో పలు కుటుంబాలను…

మంథని పట్టణంలోని మహావాది సుధీర్ తల్లి సరోజనమ్మ , మరియు భాగవతుల మోహన్ మరియు దొంతుల రాజ లింగయ్య లు ఇటీవల అనారోగ్య కారణంగా వారు మరణించగ వారి వారి కుటుంబాలను మంత్రి శ్రీధర్ బాబు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.