J.SURENDER KUMAR,
నియోజకవర్గంలో పలువురు బాధిత కుటుంబ సభ్యులను బుధవారం ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరామర్శించారు.
వెంగళాయిపేటలో..

పెగడపెల్లి మండలం వెంగళాయిపేట గ్రామ ఎంపీటీసీ తిరుపతి ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే దంపతులు పరామర్శించి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు.
గొల్లపల్లి మండలంలో..

అగ్గిమల్ల గ్రామానికి చెందిన సట్ట ఎల్లయ్య రోడ్డు ప్రమాదంలో ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
గోవిందు పల్లెలో…

గోవిందు పల్లె గ్రామానికి చెందిన బద్దం శిరీష, మామిడి వెంకటమ్మ , కొత్తూరు రాయమల్లు, లింగంపేల్లి నర్సయ్య లు ఇటీవల మృతి చెందారు. వారి ఇళ్లలోకి వెళ్లి వారి కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు.
చిల్వ కోడూరులో…

చిల్వకోడూర్ గ్రామానికి చెందిన ఎండి జహంగీర్ అనారోగ్యంతో ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.
చందోలి గ్రామంలో..

చందోళి గ్రామానికి చెందిన పరశవేని రమేష్ ఖతర్ లో ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించి ఓదార్చారు.
వారి వెంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయా గ్రామాల కార్యకర్తలు తదితరులు ఉన్నారు..