భీకర ఎన్కౌంటర్ మావోయిస్టుల మృతదేహాలు లభ్యం!

J.SURENDER KUMAR,


నారాయణపూర్ కంకేర్ సరిహద్దులోని అబుజ్మద్ ప్రాంతంలో గురువారం తెల్లవారుజాము నుంచి భీకర ఎన్‌కౌంటర్ కొనసాగుతున్నట్టు సమాచారం


పోలీసులకు, నక్సలైట్లకు మధ్య భీకర ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. నక్సలైట్లను నలువైపులా సైనికులు చుట్టుముట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ఘటనా స్థలంలో ఇరువైపుల నుంచి అడపా దడపా కాల్పులు జరుగుతున్నాయి.

నారాయణపూర్ ఎస్పీ ప్రభాత్ కుమార్ ధృవీకరించారు. ఘటనా స్థలం నుంచి ముగ్గురు నక్సలైట్ల మృతదేహాలు కూడా లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.