J.SURENDER KUMAR,
ధర్మపురి నియోజకవర్గ బుగ్గరాం మండల కేంద్రంలో మండల రెవెన్యూ, ప్రజా పరిషత్ నూతన కార్యాలయం భవన నిర్మాణాలకు శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ భూమి పూజ చేశారు.
శుక్రవారం మండల కేంద్రంలోనీ గడి లో నూతనంగా నిర్మించబోయే ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన భూమి పూజ మరియు శంకుస్థాపన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నూతన భావనాల నిర్మాణానికి అవసరమైన భూమీని దానంగా ఇచ్చిన స్వర్గీయ సదాశివరావు మరియు వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని, ఎమ్మెల్యే అన్నారు.

ప్రజల ఆమోదంతోనే, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వ కార్యాలయాలు ఉండాలనే ఉద్దేశ్యంతో నిర్మాణం చేపట్టడం జరుగుతుందని, త్వరిత గతిన నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలకు కార్యాలయాలను అందుబాటులోకి తీసుకొచ్చే విధాంగ చర్యలు తీసుకుంటామని, ఎమ్మెల్యే అన్నారు. త్వరలోనే పోలీస్ స్టేషన్, కస్తూరిబా పాఠశాల నిర్మాణం, కూడా ప్రజల ఆమోదంతో పూర్తి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు..
అనంతరం స్థానిక ఎస్సీ హాస్టల్ లో ఏర్పాటు చేసిన పరుపుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని 41 మంది విద్యార్ధులకు పరుపులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.