👉మనుషులకు ఆధార్ కార్డ్ ఎలాగో భూములకు భూధార్ కార్డ్ !
👉ముసాయిదా నూతన రెవెన్యూ చట్టం – 2024 పై చర్చా వేదిక లో జగిత్యాల కలెక్టర్ బి. సత్య ప్రసాద్ !
J.SURENDER KUMAR,
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 20 రకాల చట్టాలు ఉన్న ముసాయిదా నూతన రెవెన్యూ చట్టం- 2024 పై అభిప్రాయ సేకరణకు చర్చా వేదిక ఏర్పాటు చేసినట్లు జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు.
శుక్రవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆర్. ఓ. ఆర్ చట్టం 2024 అమలుపై న్యాయవాదులు, విద్యావేత్తలు, రైతులు, రైతు సంఘాలు, మేధావులు, విశ్రాంత రెవెన్యూ ఉద్యోగులు, గెజిటెడ్ , నాన్ గెజిటెడ్ ఉద్యోగులు స్వచ్చంధ సంస్థలతొ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు మనుషులకు ఆధార్ కార్డ్ ఎలాగో భూములకు భూధార్ కార్డ్ అని, చట్టం అనేది రైతుల చుట్టంలా ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ చట్టాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వం ఇలా ప్రజలు, రైతుల మనోభావాలను, అభిప్రాయాలను సేకరించే కార్యక్రమం, అదే విధంగా అప్పీలేట్ అవకాశం కల్పించిందని, ఏ ఒక్క రైతు కూడా నష్టపోకుండా ఉండటం కోసం, అధికార వికేంద్రీకరణ కాకుండా అధికార కేంద్రీకరణ కోసం ఆర్. ఓ. ఆర్. -2024 చట్టాన్ని ప్రభుత్వం తెచ్చినట్లు పేర్కొన్నారు. అదే విధంగా ఇందులో వ్యవసాయ భూములే కాకుండా వ్యవసాయేతర భూములు, అబాది భూముల గరించి చాలా మంది రైతులు ఇబ్బందులు పడుతున్నందున ఈ చట్టంలో వీటికి అవకాశం కల్పించే అవకాశం ఉందని తెలిపారు.
చర్చ కార్యక్రమంలో పాల్గొన్న వారి అభిప్రాయాలను కలెక్టర్ డ్రాఫ్ట్ రూపంలో నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు. ఈ చర్చా కార్యక్రమాల అనంతరం ఆర్. ఓ. ఆర్. -2024 చట్టంపై అన్నీ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారని కలెక్టర్ వివరించారు.
👉 మెట్ పల్లి ఆర్డీఓ శ్రీనివాస్ …
.మాట్లాడుతూ ఆగస్టు 2 నుండి 23 వరకు సి. సి. ఎల్. ఏ వెబ్ సైట్ లో అభ్యంతరాల స్వీకరణలకు తమ అభిప్రాయాలను పోస్ట్ ద్వారా గాని వెబ్ సైట్ లో గాని ధరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించిందని తెలిపారు. జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు భూమికి ఒక నంబర్ ఉండాలన్న ఉద్దేశ్యంతొ భూధార్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. భూధార్ కార్డులు సర్వే చేసిన తర్వాత భూమి యజమానులకు మాత్రమే మంజూరు చేయడం జరుగుతుందని, భూధార్ లో తాత్కాలిక, శాశ్వత భూధార్ గురించి, హక్కుల రికార్డ్, నమోదు చేయు అధికారి, ఆబాది, వ్యవసాయేతర భూములకు సంబంధించిన రికార్డుల గురించి, మ్యూటేషన్ గురించి అప్పీలేట్ అథారిటీ గురించి వివరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త చట్టంలో అప్పీలేట్ అధికారులను నియమించనున్నారని, తహశీల్దార్, ఆర్డీఓల మ్యూటేషన్లపై అభ్యంతరాలను స్వీకరించే అవకాశం ఉందని తెలిపారు. భూమికి సంబంధించిన రికార్డ్ చేసేటప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి తర్వాత మెయింటెన్ చేసి దాన్ని అప్ డేట్ చేయాల్సి ఉంటుందని వివరించారు.
కార్యక్రమంలో పాల్గొన్న కొందరు ఈ ఆర్. ఓ. ఆర్.-2024 చట్టంపై ఈ క్రింది విధంగా తమ అభిప్రాయాలను వివరించారు.
👉రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ కృష్ణా రెడ్డి ..

మాట్లాడుతూ గత సంవత్సరంలో మనుషులకు ఎలా అయితే ఆధార్ కార్డ్ ఉందో కమతాలకు కూడా శాశ్వత నెంబర్ ఇవ్వడం అనేది చాలా మంచి విషయమని, డిజిటల్ తొ పాటు నిర్దిష్టమైన సమయం అనేది ప్రస్తావించాలని తెలిపారు. గత ప్రభుత్వంలో దాదాపుగా 9 లక్షల ధరఖాస్తులు భూ సమస్యలపై రావడం జరిగిందని అవి ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోలేదని వివరించారు. గ్రామ కంఠం అనేది గ్రామంలో ప్రజలు నివాసం కోసం అన్ని వసతులతో ఏర్పాటు చేసుకున్న స్థలం అని వ్యవసాయేతర, ఇండ్లున్న స్థలంలో భూ సమస్యలు కానీ, నాలా సమస్యలు కానీ వచ్చినట్లయితే ఎంక్వైరీ చేసి దానికి అప్పీల్ టైం 45 రోజుల నుండి 60 రోజుల సమాసం మాత్రమే ఇవ్వాలని, లేకుండా 1 లేదా 2 సార్లు అప్పీల్ చూసి క్లోజ్ చేయాలని సూచించారు.
👉రిటైర్డ్ తహశీల్దార్ గంగారం…
మాట్లాడుతూ 2017 లో భూమి రిజిస్ట్రేషన్లు జరిగినప్పుడు చాలా అవకతవకలు జరిగాయని, ఇనామా భూములపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టాలని, వ్యవసాయేతర భూములకు కూడా పట్టా పాసుపుస్తకం ఇవ్వడం కాకుండా, చిన్న సన్నకారు రైతులకే కాకుండా సాదా బైనామా ఉన్న అందరికీ పట్టా ఇస్తే బాగుంటుందని, గ్రామాలలో అక్రమంగా భూములు కబ్జా చేసుకుంటున్నందున వాటిని గుర్తించాలని వివరించారు.
👉మహేందర్, న్యాయవాది…

మాట్లాడుతూ మ్యూటేషన్ లో ఎక్కడ కుటుంబ సభ్యుల సెటిల్ మెంట్ ఆస్కారం ఉందా?, రెవెన్యూ రికార్డ్ లో వ్యవసాయ భూమిని చూపించారు డెయిరీ ఫామ్స్, ఫౌల్ట్రీ ఫామ్స్ గురించి ప్రస్తావించలేదని తెలిపారు. గ్రామానికి ఒక అధికారిని నియమించి రెవెన్యూ ట్రిబ్యునల్ ఎస్టాబ్లిష్ చేయాలి. రిజిస్ట్రేషన్ సమయంలో స్టాంప్ పేనాల్టీలో ప్రస్తుత మార్కెట్ రేటు కాకుండా ధరఖాస్తు చేసినప్పుడు ఏ రేటు ఉందో అదే ఉంచాలని వివరించారు.
👉సీనియర్ సిటిజన్ హరి అశోక్ కుమార్.
మాట్లాడుతూ గతంలో లాగా వీఆర్ఓ వ్యవస్థను పునరుద్ధరించడం వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని, రైతుల నుండి భూమిని సేకరించిన తర్వాత ధరణి పోర్టల్ లో డెలిట్ ఆప్షన్ లేక రైతులు చాలా ఇబ్బందులు పడ్డారని, ధరణిలో పలు రకాల సమస్యలు తలెత్తడం వల్ల ఆర్.ఓ. ఆర్.-2024 చట్టం తీసుకురావడం మంచి అభిప్రాయమని వివరించారు.
👉శంకర్, రైతు…

మాట్లాడుతూ ధరణి పోర్టల్ ద్వారా చాలా మంది రైతులు నష్టపోయారని, అన్యాయలు, అక్రమాలు ఉండడం వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని వివరించారు. అధికారులు రైతుల భూములు డెలిట్ చేయడం వల్ల రైతులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని వి. ఆర్. ఓ. వ్యవస్థను పునరుద్ధరీస్తే బాగుంటుందని తెలిపారు. దేవాదాయ శాఖకు కొంత భూమిని రైతులు ఇచ్చినప్పుడు మిగతా భూమికి అదే సర్వే నంబర్ ఉండడం వల్ల రైతులు భూమిని అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.
👉కుమార స్వామి సర్వేయర్ ..
మాట్లాడుతూ రైతుల భూములు పట్టా మీద ఒక విధంగా, మోక మీద ఒక విధంగా ఉంటుందని ఆలయ కాకుండా అధికారులు సమన్వయంతో వ్యవహరిస్తూ క్లస్టర్ వైజ్ గా డిప్యూటీ సర్వేయర్లను నియామిస్తే మోకా మీదకి పోయి వచ్చి డైరెక్ట్ గా గూగుల్ మ్యాప్ తీసుకుని పహాని మరియు మ్యాప్ ను రెండు ఒకే సమయంలో చేయడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయని పేర్కొన్నారు.
👉రెవెన్యూ ట్రెసా అధ్యక్షుడు వకీల్….
మాట్లాడుతూ ప్రజల మనోభావాలను, అభిప్రాయాలను తీసుకోవడం చాలా మంచి విషయమని, ధరణి-2020 కి చట్ట బద్ధత లేదని ఎటువంటి సూచనలు తీసుకోకుండా కొందరి లభ్యం కోసం ఏర్పాటు చేశారని వివరించారు. చట్టం అనేది రైతులకు చుట్టంలా ఉండాలని తెలిపారు. విరాసిత్ ను సులభతరం చేయాలని సూచించారు. గ్రామాలలో, మండలాలలో చెరువులు, కుంటలు అన్యాక్రాంతం అవుతున్నాయని ల్యాండ్ రిజిస్ట్రేషన్ మేనేజ్ మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లో నమోదు పకడ్బందీగా చేయాలని, రైతు కోణంలో, రైతు కళ్ళల్లో ఆనందం చూడాలని కోరుకుంటున్నామని తెలిపారు.
👉జిల్లా TNGO అధ్యక్షుడు శశిధర్…
మాట్లాడుతూ సెక్షన్ 1 (25) లో రెవెన్యూ విలేజ్ కి ఎవరు బాధ్యత వాహిస్తారరాని, రైతు ప్రతి సారి ఎమ్మార్వో ఆఫీస్ కు వచ్చి చెక్ చేసుకోలేడని, అదే విధంగా మీ సేవకి వెళ్ళి పహాని తీయాలంటే రైతులు ఇబ్బంది పడుతున్నారని, ప్రతి గ్రామంలో ఒక ఆఫీసర్ ను నియమించాలని సూచించారు. చెరువులు, కుంటలు కొన్ని ప్రొహిబిటెడ్ అయినవని, చాలా తప్పిదాలు జరిగినవని సర్వేయర్ల రిపోర్ట్ లు తీసుకొని ఇరిగేషన్ ప్రాజెక్ట్ సిస్టమ్ ని అప్ డేట్ సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. రాంబాబు, జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి ఆర్డీఓలు మధు సుధన్, ఆనంద్ కుమార్, శ్రీనివాస్, రెవెన్యూ ట్రెసా అధ్యక్షులు వకీల్, జిల్లా టీఎన్జీఓ అధ్యక్షులు శశిధర్, న్యాయవాదులు, విద్యావేత్తలు, రైతులు, రైతు సంఘాలు, మేధావులు, విశ్రాంత రెవెన్యూ ఉద్యోగులు, గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.