J.SURENDER KUMAR,
విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతో అవసరమని క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుడ్యాన్ని పెంచుతాయని, ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మపురి లోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించే మండల స్థాయి క్రీడ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమంలో శుక్రవారం ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ముఖ్య అతిథిగా పాల్గొనీ క్రీడలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ధర్మపురి మండల స్థాయి క్రీడలు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని, విద్యార్థులు మండల స్థాయి నుండి జిల్లా, రాష్ట్ర, జాతీయ, మరియు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు కల్గించేలా చర్యలు చేపడుతుందని, విద్యారంగంలో ధర్మపురి ప్రాంతాన్ని ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చి దిద్దెందుకు డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ మరియు ఐటిఐ కళాశాలతో పాటు నవోదయ పాఠశాల ఏర్పాటు చేసేందుకు కృషి చేయనున్నట్లు ఈ సంధర్బంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్యమ్మ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.