J.SURENDER KUMAR,
గత కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతు మృతి చెందిన కాంగ్రెస్ నాయకుడి అంతిమ సంస్కార యాత్రలో ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ శుక్రవారం పాల్గొన్నారు.

ధర్మపురి మండలం దొంతపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు సర్ధ లక్ష్మణ్ రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్ లోనీ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. శుక్రవారం దొంతపూర్లో లో దహన సంస్కారాలు జరిగాయి.

ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ లక్ష్మణ్ లక్ష్మణ్ మృతదేహానికి పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సంధర్బంగా మృతుని కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన అన్ని విధాలా అండగా ఉంటామని ఎమ్మెల్యే సందర్భంగా తెలిపారు. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.