దళితుల పక్షాన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞత సభ ఏర్పాటు చేస్తాం !

👉సుప్రీం కోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు రావడం చాలా సంతోషకరం!

👉సీఎం రేవంత్ రెడ్డికి, మంద కృష్ణమాదిగకి అభినందనలు, కృతజ్ఞతలు !

👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


త్వరలోనే దళితవర్గాల పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్

రెడ్డికి ధన్యవాదాలు తెలిపే విధంగా కృతజ్ఞత సభ ఏర్పాటు

చేయనున్నామని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి

లక్ష్మణ్ కుమార్ అన్నారు.


ఇటీవల ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సుప్రీం కోర్టులో ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం అనుకూలమైన తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ధర్మపురి నియోజకవర్గ ఎమ్మార్పీఎస్, మరియు దళిత సంఘాల ఆద్వర్యంలో ఆదివారం ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ధర్మపురి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు..


ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..
సుదీర్ఘ కాలంగా చేసిన పోరాటం అనంతరం జనాభా ప్రాతిపదికన ఎస్సీ వర్గీకరణకు సుప్రీం కోర్టులో అనుకూలంగా తీర్పు రావడం చాలా సంతోషంగా ఉందని, ఈ సందర్భంగా మన దళిత సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియజేయడానికి గర్వంగా ఉందన్నారు.


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి దామోదర రాజనరసింహ, నేతృత్వంలో మేము ఢిల్లీకి వెళ్లి తెలంగాణ రాష్ట్రం తరపున మా వాదనలు గౌరవ సుప్రీం కోర్టులో వినిపించడం జరిగిందన్నారు.


మన వాదనలు సుప్రీంకోర్టులో బలంగా వినిపించడానికి దేశంలో ప్రముఖ న్యాయవాదులను నియమించుకోవడానికి ఎంత ఖర్చు అయిన రాష్ట్ర ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాకు బరోసా ఇచ్చారు అని ఎమ్మెల్యే అన్నారు.


రాష్ర్టంలో ఉన్న మన మాదిగ సోదరుల పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు సభాముఖంగా తెలిపారు.
త్వరలో నిర్వహించనున్న కృతజ్ఞత సభకు పెద్ద ఎత్తున దళిత సోదరులు తరలి రావాలని, త్వరలో ప్రతి మండలానికి స్వయంగా నేనే పర్యటించి ప్రతి ఒక్కరి సమస్యలు నేరుగా విని పరిష్కరిస్తామని, మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంద కృష్ణమాదిగకు అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు,పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.