ధర్మపురిలో సెప్టెంబర్ 2న విశ్వ హిందూ పరిషత్ ఆత్మీయ సమ్మేళనం!

J.SURENDER KUMAR,


విశ్వ హిందూ పరిషత్ 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ధర్మపురి శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2న ( సోమవారం ) ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.


విశ్వ హిందూ పరిషత్ విశ్వవ్యాప్తంగా ఉన్న వేలాది ధార్మిక సంస్థల ఏకైక వేదిక . 1964వ సం. శ్రీకృష్ణ జయంతి నాడు ప్రారంభమై వందకు పైగా దేశాలకు విస్తరించి లక్షలాది కార్యకర్తలను కలిగి, ధర్మాచార్యుల ఆశీస్సులతో నిరంతరం వికసిస్తూ 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.


ధర్మపురి నగరంలోని శ్రేయోభిలాషులు, హిత చింతకులు, శ్రీరామ జన్మభూమి మందిర నిర్మాణానికి సహాయ, సహకారాలు అందించిన హిందూ బంధువులందరితో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకుంటున్నాం. కుటుంబ సమేతంగా ఇట్టి కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా విశ్వహిందూ పరిషత్ శాఖ ప్రకటనలో పేర్కొంది.

స్థానిక ఎస్సార్ ఆర్ ఫంక్షన్ హాల్లో ఉదయం 10 గంటలకు కార్యక్రమం ప్రారంభముతున్నది పేర్కొన్నారు. ఈ సమ్మేళనంలో దాన్య శ్రీ ధనంజయ్ సమరసత తెలంగాణ ప్రాంత ప్రముఖ్ ప్రధాన వక్త అని పేర్కొన్నారు.