J.SURENDER KUMAR,
దేశంలో ఎక్కడా లేని శ్రీ యమధర్మరాజు ఆలయం ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ఉండడం మన అదృష్టమని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
‘భరణి’ నక్షత్ర పర్వదినం సందర్భంగా ఆదివారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

ఈ సందర్భంగా దేవాలయంలో స్వామివారికి ప్రత్యేకంగా నిర్వహించిన యజ్ఞాదిహోమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అత్యంత పవిత్రమైన భరణి నక్షత్ర పర్వదినం సందర్భంగా స్వామి వారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, స్వామి వారి కరుణ కటాక్షాలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన , తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం పైన ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు..

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.