ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కు రేపటికి 25 వ వివాహ వార్షికోత్సవం !

👉 వివాహ వార్షికోత్సవ సందర్భంగా…

J.SURENDER KUMAR,


ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్, కాంత కుమారి దంపతుల వివాహ వార్షికోత్సవం రేపటికి 25 వసంతాలు పూర్తి కానున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో 2000 సంవత్సరం ఆగస్టు 10 న వీరి వివాహం సాంప్రదాయబద్ధంగా, కుటుంబ పెద్దల సమక్షంలో జరిగింది.

👉విద్యావంతురాలు..

ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ సతీమణి కాంతా కుమారి విద్యావంతురాలు, జూనియర్ లెక్చరర్ గా 1990 నుంచి 2009 వరకు, 2010 నుంచి డిగ్రీ కాలేజీ లెక్చరర్ గా ఎకనామిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా అంబేద్కర్ యూనివర్సిటీ ఓపెన్ కోఆర్డినేటర్ టూరిజం కన్వీనర్, స్టాఫ్ క్లబ్ సెక్రటరీస్ ప్రోగ్రాము ఆఫీసర్, టీం ఇంచార్జి, హెడ్ అఫ్ ది డిపార్ట్మెంట్ గా డిగ్రీ గడ్క, మంథని కరీంనగర్ లో విధులు నిర్వహించారు. ఎకనామిక్స్ కాకతీయ యూనివర్సిటీ నుంచి మాస్టర్ అఫ్ ఫెలోషిప్ అందుకున్నారు. బెడ్ అన్నమలై యూనివర్సిటీ ‘ లా ‘ విద్య పూర్తి చేశారు.

👉లక్ష్మణ్ కుమార్ లక్ష్యసాధనలో ఆమె సైతం…

ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, NSU విద్యార్థి సంఘ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, ధర్మారం జడ్పిటిసి సభ్యుడిగా, ఉమ్మడి కరీంనగర్ నగర్ జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఉమ్మడి రాష్ట్రలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా పదవులు చేపట్టిన. లక్ష్మణ్ కుమార్ ఏకైక లక్ష్యం ఎమ్మెల్యేగా చట్టసభకు ప్రాతినిథ్యం వహించాలని కోరిక అని లక్ష్మణ్ కుమార్ సతీమణి కాంతా కుమారి పలు సందర్భాల్లో వివరించారు.
2009 నుంచి తెలంగాణ ఉద్యమంలో రెండుసార్లు మధ్యంతర ఎన్నికలు, 2014, ఎన్నికల్లో ఓటమి పొందిన లక్ష్మణ్ కుమార్, లక్ష్యసాధన కోసం ఎమ్మెల్యే సతీమణి, కాంతా కుమారి తన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి స్వచ్ఛంద పదవి విరమణ చేసి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృతంగా పర్యటించారు.

2018 ఎన్నికల్లో ప్రచారం దృశ్యం ( ఫైల్ ఫోటో)

స్వల్ప ఓట్ల తో ఓటమి చెందిన లక్ష్మణ్ కుమార్, వెన్నంటి ఉండి 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఆమె ఒంటరిగా గ్రామ గ్రామాన తిరుగుతూ లక్ష్మణ్ కుమార్ గెలుపుకు గఫ్ చూప్ గా ప్రచారం చేసి లక్ష్మణ్ కుమార్ గెలుపులో కీలకపాత్ర వహించారు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారంలో(ఫైల్ ఫోటో)

👉14 సంవత్సరాల రాజకీయ వనవాసం మాది..

2009 నుంచి 2023 వరకు 14 సంవత్సరాల రాజకీయ వనవాసం మాది, అని ఎమ్మెల్యే సతీమణి కాంతా కుమారి ఆవేదన వ్యక్తం చేశారు. కష్టాలు సామర్థ్యాన్ని బయటికి తీస్తాయి, అవమానా లు ఒక మెట్టు ఎక్కేలా చేస్తాయి, హేళనలు విజయానికి, పట్టుదల కసిని పెంచి దోహదపడతాయని నేను విద్యార్థులకు చెప్పిన పాఠాలు లక్ష్మణ్ కుమార్ లక్ష్యసాధనకు మెట్లుగా మారాయని అన్నారు. ఆగస్టు 10న తమ 25 వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఎమ్మెల్యే సతీమణి సంతోషాన్ని పంచుకున్నారు.