ధర్మపురి నియోజకవర్గానికి సాగు తాగు నీటీ సమస్య ఉండదు !

👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,

ధర్మపురి పట్టణానికి తాగునీరు అందించాలనే ఉద్దేశ్యంతో రూపొందించిన ప్రాజెక్టు కు భూమి పూజ చేయడం సంతోషంగా ఉందని, ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


పట్టణంలోని స్థానిక కూరగాయల మార్కెట్ లో గురువారం అమృత్ 2.0 ప్యాకేజీ -1 ద్వారా ధర్మపురి ప్రాంతానికి నీరు అందించాలనే ఉద్దేశంతో రూపొందించిన నీటి సరఫరా ప్రాజెక్ట్ కి సంబందించిన అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.


అనంతరం ధర్మపురి మున్సిపల్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ కి సంబందించిన అర్హులైన 60 మంది లబ్ధిదారులకు ఇంటి నంబర్లను కేటాయించగా వారికి ఇంటి నంబర్లకు సంబందించిన ఓనర్ షిప్ సర్టిఫికెట్లను ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..
గత ప్రభుత్వ నాయకుల అనాలోచిత నిర్ణయాల వల్ల తలపున గోదావరి ఉన్న ఇక్కడి ప్రాంతానికి తాగు నీరు అందని పరిస్థితి ఉందని, ధర్మపురి నియోజకవర్గానికి సాగు, తాగు నీరు అందించే విషయం గూర్చి ముఖ్యమంత్రిని కలిసి వివరించడం జరిగిందన్నారు.


ధర్మపురి నియోజకవర్గానికి నీరు అందించే విషంలో ప్రభుత్వం నుండి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగిందనీ, ఈ ప్రాంతానికి సంబంధించి త్రాగు నీరు అందించే విషయం తన శాయశక్తులా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు..
ఈ కార్యక్రమంలో అధికారులు మండలు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.