ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రినీ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ !

J.SURENDER KUMAR,


జిల్లాలో జ్వరాలు విజృంభిస్తున్నందున శుక్రవారం రోజున ధర్మపురి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ బి సత్య ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.


ఈ సందర్భంగా కలెక్టర్ వైద్యుల హాజరు పట్టికను పరిశీలించి గైర్హాజరైన వైద్యుల వివరాలు సేకరించి వారిపై తగిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ఇన్ పేషంట్ మరియు ఔట్ పేషెంట్ విభాగాలను పరిశీలించి అడ్మిట్ అయి ఉన్నటువంటి పేషెంట్లను వారికి అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ల పనితీరు బాగుందా ?అని వైద్య సేవలు సరిగ్గా అందుతున్నాయా ? అని అడిగి తెలుసుకున్నారు.

తర్వాత డ్రగ్ స్ స్టోర్ రూమ్ ను తనిఖీ చేసి రిజిస్టర్ ప్రకారం మందులు స్టాక్ నిల్వలు ఉన్నాయా ? లేవా? అని సరిచూశారు. జ్వరాలు ఎక్కువగా ప్రబలుతున్న నేపథ్యంలో వైద్యులందరూ మరియు సిబ్బంది సమయపాలన పాటించాలని గైర్హాజరైనటువంటి వైద్యులపై తగిన చర్యలు తీసుకోబడతాయని మరోసారి హెచ్చరించారు.


ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీఓ మధు సుధన్, మున్సిపల్ కమిషనర్, ఎమ్మార్వో, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సమియుద్దిన్, డిప్యూటీ DM&HO శ్రీనివాస్, ఆర్ ఎం ఓ డాక్టర్ రామకృష్ణ ,తదితరులు పాల్గొన్నారు.