👉నృసింహ పురాణముఏకమధ్యయనం అంశంపై సంస్కృతంలో పరిశోధన !
J.SURENDER KUMAR,
ధర్మపురి క్షేత్రానికి చెందిన గుండి శ్రీనివాస్ ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ ప్రధానం చేస్తున్నట్టు ప్రకటన జారీ చేశారు.
శ్రీనివాస్ ‘నృసింహ పురాణముఏకమధ్యయనం’ అనే అంశంపై సంస్కృతంలో డాక్టర్ చేశారు.
సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన ధర్మపురి క్షేత్రం నుంచి దాదాపు 25 సంవత్సరాల కాలంలో సంస్కృతంలో డాక్టరేట్ గుండి శ్రీనివాస్ చేశారని క్షేత్రంలో చర్చ.

ఉస్మానియా యూనివర్సిటీ సంస్కృత విభాగం అధిపతి ఆచార్య కశోఝల నీలకంఠం , ప్రోత్సాహం సహాయ సహకారాలతో తాను పిహెచ్డి పూర్తి చేశానని డాక్టర్ గుండి శ్రీనివాస్ అన్నారు. శ్రీనివాస్ కు డాక్టరేట్ రావడం పట్ల పలువురు విద్యావేత్తలు. స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు

.
డాక్టర్ గుండి శ్రీనివాస్ గూర్చి….
👉విద్యాభ్యాసం
10 వ తరగతి వరకు సంస్క్రత పాఠశాల(ధర్మపురి).Entrance to B.A(L) Oriental (S.L.N.S.A)కళాశాల, ధర్మపురి.
T.P.T(Telugu Pandit Training) ప్రభుత్వ B.Ed కళాశాల,హనుమకొండ.M.A(Telugu) ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్.
M.A(Sanskrit)కాకతీయ యూనివర్సిటీ వరంగల్ (S.V.S.A) Oriental కళాశాల.
M.Phil రఘువంశం ఉస్మానియా యూనివర్సిటీ. P.Hd(Sanskrit) ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ నృసింహ పురాణముఏకమధ్యయనం.

👉రచనలు..
సాహిత్య మాస పత్రికలో “కాళిదాసు రచనల్లో స్త్రీ పాత్ర చిత్రన”అనే వ్యాసం ప్రచురితమైంది.
చేతిన మాస పత్రికలో “మేఘసందేశం యక్షదంపతుల ప్రేమైక దాంపత్యం” అనే వ్యాసం.
వైశ్య విజన్ పత్రికలో “గృహస్థాశ్రమధర్మం-దాని ప్రాధాన్యత ” అనే వ్యాసం.
స్రవంతి(ద్విభాషా)మాస పత్రికలో ” విద్య దాని ప్రాధాన్యం”.
చేతన మాస పత్రికలో ” భారతీయ సాహిత్యం -కాళిదాసు”.స్రవంతి (ద్విభాషా)మాస పత్రికలో ” కాళిదాసు కావ్యశైలి-కవితాసౌందర్యం”.
స్రవంతి(ద్విభాషా)మాస పత్రికలో “సుదక్షిణా-దిలీపులు-ధర్మార్థకామములు”.
స్రవంతి(ద్విభాషా)మాస పత్రికలో ” సాంఖ్య యోగముల సామ్యము-పరిశీలన”.
స్రవంతి (ద్విభాషా)మాస పత్రికలో సంస్క్రత సాహిత్యములో “మహనీయ మహితోక్తులు”.
వరంగల్ వాణి పత్రికలో
“పోతనభాగవతం-లౌకిక దృక్పథం “.
స్రవంతి(ద్విభాషా) పత్రికలో “భరతుడు-
నాట్యశాస్త్రప్రాశస్త్యం”.
స్రవంతి (ద్విభాషా) పత్రికలో”విశ్వవిద్యాలయ ప్రగతిలో పరివర్తన-ఆవశ్యకత”
అరణ్య స్పందన అనే ఆధ్యాత్మిక మాసపత్రికలో “దాంపత్యం తత్వము”.
ఘంటారావం అనే దినపత్రికలో ” సకల శాస్త్రపారంగతుడు-సత్కవీంద్రుడు కొరిడె రామయ్య”.
” సంస్క్రత సాహిత్యమే సుభాషితాని”.
ధర్మశాస్త్రం అనే తెలుగు మాసపత్రికలో ” ఉపనయన ప్రాధాన్యత”.
ఘంటారావం అనే దినపత్రికలో “శ్రీరామ జననం -సీతారామకళ్యాణం”.

👉సెమినార్లు:
కాకతీయ విశ్వవిద్యాలయం వారి జాతీయ సెమినార్ లో “జెండర్ స్పృహ”అనే పేపర్ ప్రజెంట్ చేశాను.
Sanskrit Academy (Osmania university)వారి
Three-day national seminar లో “పురాణోక్త ధర్మః”అనే సెమినార్.
(S.V.S.A) Oriental కళాశాల వరంగల్ వారి National Seminar లో పేపర్ ప్రజెంట్ చేశాను.
(S.L.N.S.A)Oriental కళాశాల ధర్మపురి వారి National Seminar లో
“ఖడ్గలక్షణశిరోమని” అనే పేపర్ ప్రజెంట్ చేశాను.
ఇవికాక చాలా సెమినర్లలో పేపర్ ప్రజెంట్ చేశాను.
👉అవార్డు:

“తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్”(Telugu book of records) అనే అవార్డు వచ్చింది.
” కవిశ్రేష్ఠ” అనే బిరుదు ఇచ్చారు.
రేడియో ప్రోగ్రామ్స్:
వరంగల్ రేడియో లో 4 అంశాలపై ప్రోగ్రాం ఇచ్చాను
కాకతీయ యూనివర్సిటీ (S.D.L.C ) B.A , B.Sc, B.com వారికి సంస్కృత పాఠ్యాంశాలు రాయడం జరిగింది.
👉సామాజిక సేవా:
30 సంవత్సరాల నుండి మట్టి గణపతులు బహుకరణం..