ధరణి సమస్యలను సత్వరమే పరిష్కరించాలి!

👉ఆగస్టు 2 నుండి 23 వరకు ప్రజాభిప్రాయ సేకరణ ముసాయిదా బిల్లుపై తమ అభిప్రాయాలు తెలపండి !

👉మాన్యువల్ సర్టిఫికేషన్ కు బదులుగా ఆన్ లైన్ సర్టిఫికేషన్ కు ప్రాధాన్యత ఇవ్వాలి

👉జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో…

👉ల్యాండ్ రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ !


J.SURENDER KUMAR,


ధరణి సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రిన్సిపల్ సెక్రటరీ, ల్యాండ్ రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ ఆదేశించారు.


శనివారం హైదరాబాద్ నుండి ధరణి సమస్యలు, కోర్టు కేసుల పెండింగ్ సమస్యలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ముసాయిదా బిల్లుపై ప్రజాభిప్రాయ సేకరణ ప్రజల నుండి సూచనలు, సలహాలు స్వీకరించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టారు.

👉సలహాలు - సూచనలు ఇవ్వండి..

http://ccla.telangana.gov.in/ వెబ్ సైట్ అందుబాటులో ఉంటుందని, ఆగస్టు 2 నుండి 23 వరకు ఎవరైనా తమ అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేసేందుకు వీలు కల్పించడానికి ror2024-rev@telangana.gov.in కు మెయిల్ పంపవచ్చు లేదా CCLA ఆఫీస్ కు పోస్ట్ ద్వారా అయిన పంపవచ్చు అని పేర్కొన్నారు.

👉ఆన్ లైన్ సర్టిఫికెట్ లు ఇవ్వండి

అదే విధంగా ధరణి సర్టిఫికెట్ లను జారీ చేయడంలో సరైన వెరిఫికేషన్ లేకుండా మాన్యువల్ ఎక్కువగా ఇస్తున్నారని అలా కాకుండా పూర్తి విచారణ చేసి ఆన్ లైన్ లో మాత్రమే జారీ చేసే విధంగా తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న సర్టిఫికెట్ లను 15 రోజుల్లోగా పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.

👉కలెక్టర్ బి. సత్య ప్రసాద్ మాట్లాడుతూ..

కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ మాట్లాడుతూ జగిత్యాల జిల్లాకు సంబంధించి ఈ రోజు వరకు మొత్తం 1342 ధరఖాస్తులు రాగా తహశీల్దార్ పరిధిలో 311, ఆర్డీఓ ల దగ్గర 550, అదనపు కలెక్టర్ 205, కలెక్టర్ వద్ద 276 పెండింగ్ లో ఉన్నవని వీటన్నింటినీ ఆగస్టు 15 లోగా పూర్తి చేస్తామని ఆయన వివరించారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆర్డీవోలు, తహశీల్దార్లతో ధరణి పెండింగ్ దరఖాస్తుల పై సమీక్షిస్తూ ఆగస్టు 15 లోగా పూర్తి చేసే విధంగా చూడాలని ఆదేశించారు.


👉ఏ స్టేజ్ లో ఉన్నాయి..


ఆన్ లైన్ లో దరఖాస్తులు ఏ ఏ స్టేజ్ లో ఉన్నాయో తెలుసుకోవడానికి ట్రాకింగ్ చేస్తామని పేర్కొన్నారు. స్క్రూటిని చేసి ఆన్ లైన్ లో ఎన్ని దరఖాస్తులు ఉన్నాయో ఫిజికల్ గా కూడా అవే ఉండాలని, ఆన్ లైన్ లో ముందు చేసి మాన్యువల్ గా ఎప్పుడో పంపిస్తున్నారని తెలిపారు. అదే విధంగా డ్రాఫ్టింగ్ చేసేటప్పుడు క్లియర్ గా పర్ఫెక్షన్ తో నోట్ ఫైల్ పెట్టాలని దాని మీదనే దరఖాస్తు అప్రూవ్, రిజెక్షన్ చేసే వీలు ఉంటుందని అధికారులను ఆదేశించారు.


కోర్టు కేసుల పెండింగ్ లు ఏ ఏ దశలలో ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో ఆదనపు కలెక్టర్ పి. రాంబాబు, జగిత్యాల, కోరుట్ల, మెట్ పల్లి ఆర్డీవోలు మధు సుధన్, ఆనంద్ కుమార్, శ్రీనివాస్, కలెక్టరేట్ ఏ.ఓ హన్మంతరావు, తహశీల్దార్లు, సంబంధిత సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.