ఘనంగా యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం !

J.SURENDER KUMAR,


అఖిలభారత యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ధర్మపురి పట్టణం మరియు జగిత్యాల జిల్లా కేంద్రాలలో నిర్వహించిన ఆవిర్భావ వేడుకల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు..


ముందుగా ధర్మపురి పట్టణంలోని స్థానిక నంది విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ఆవిర్భావ వేడుకల్లో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పాల్గొని యూత్ కాంగ్రెస్ పతకాన్ని ఆవిష్కరించి యూత్ కాంగ్రెస్ నాయకులకు శుభాకాంక్షలు తెలియజేశారు.


అనంతరం జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక ఇందిరా భవన్ లో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ పతాకాన్ని ఆవిష్కరించి మొక్కను నాటారు.