👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన (CMR) ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తుల ను స్వయంగా నేనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, ప్రిన్సిపల్ సెక్రటరీ ని కలిసి ధర్మపురి నియోజకవర్గం నిరుపేదలకు చెందిన దాదాపు రెండు వేల చెక్కులను రాజకీయ పార్టీలకతీతంగా మంజూరు చేయించాను అని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.

బుగ్గారం మండల కేంద్రంలోని స్థానిక పోచమ్మ ఫంక్షన్ హాల్ లో బుధవారం ఏర్పాటు చేసిన CMRF చెక్కులు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ పాల్గొని ₹ 30 లక్షల విలువ గల 130 చెక్కులను,అదే విధంగా ₹ 2 లక్షల విలువ గల 2 కళ్యాణ లక్ష్మీ చెక్కులను అర్హులైన లబ్ధదారులకు పంపిణీ చేశారు..
అనంతరం శేకెళ్ళ గ్రామంలోని ఎల్లమ్మ ఆలయం లో ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…

కళ్యాణ లక్ష్మీ చెక్కులను అందుకున్న లబ్దిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ విడతలో చెక్కులు రానివారు బాధపడాల్సిన అవసరం లేదని, మరో విడత చెక్ వచ్చే అవకాశం ఉంటుందని, ఎవ్వరికీ ఎటువంటి అవసరం ఉన్న నేరుగా తననీ కలవచ్చని, అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా చూస్తామని, మండలానికి సంబంధించిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నారు.
ఈ కార్యక్రమంలో అధికారులు,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.