గెస్ట్ లెక్చరర్ల సమస్య సీఎం కు వివరిస్తాను ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

J.SURENDER KUMAR,


జూనియర్ కళాశాల గెస్ట్ లెక్చర్స్ సమస్యను సీఎం రేవంత్ రెడ్డికి వివరిస్తానని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


జూనియర్ కళాశాల గెస్ట్ లెక్చర్స్ అసోసియేషన్ తమను ఆదుకోవాలని శుక్రవారం హైదరాబాదులో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను కలిసి వినతి పత్రాన్ని ఇచ్చారు.
ఈ సందర్భంగా తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఎమ్మెల్యే అడ్లురి లక్ష్మణ్ కుమార్ ద్వారా ప్రభుత్వాన్ని కోరారు.

ఈ విషయం పైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ను కూడా కలిసి ఇట్టి విషయం పట్ల చర్చించామని మంత్రి సానుకూలంగా స్పందించారని, జూనియర్ కాలేజీలో పనిచేస్తున్న 1654 మంది గెస్ట్ లెక్చర్లందరికి ప్రభుత్వం అండగా ఉంటుందని మీ అంశాన్ని మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగిందని ఉద్యోగ భద్రతను కల్పించే బాధ్యత ప్రభుత్వం పైన ఉందని స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగిందనీ ముఖ్యమంత్రి ఇట్టి అంశం పట్ల సానుకూలంగా ఉన్నారని ఈ సంధర్బంగా ఎమ్మెల్యే తెలిపారు.