గల్ఫ్ లో ఉద్యోగాల కోసం నకిలీ ఏజెంట్లను ఆశ్రయించవద్దు !

👉జిల్లా ఎస్పి  అశోక్ కుమార్ !


J.SURENDER KUMAR,


గల్ఫ్  ఏజెన్సీలు, ఏజెంట్ లు  ఇమిగ్రేషన్ యాక్ట్ 1983  నిబంధనలకు లోబడి మాత్రమే పనిచేయాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. ఏజెన్సీలు అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చే కంపెనీల వివరాలు, జీతభత్యాలు మరియు ఇతర సమాచారాన్ని అభ్యర్థులకు సరిగ్గా తెలపాలని ఎస్పి ఆదేశించారు.


జిల్లాలో జరుగుతున్న గల్ఫ్ మోసాల నివారణ మరియు పాటించాల్సిన నియమ నిబంధనలు గూర్చి నిరుద్యోగ యువతకు, బాధితులకు మరియు ఏజెంట్లకు గురువారం స్థానిక సుమంగళి గార్డన్ లో  పోలీస్ శాఖ మరియు ప్రొటెక్టర్ ఆఫ్ ఏమిగ్రాంట్స్ హైదారాబాద్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్సటర్నల్ ఎఫైర్స్ వారి ఆద్వర్యంలో అవగాహన మరియు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.


ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ….


ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్ళు యువకులు ప్రభుత్వ లైసెన్స్ గల ఏజెన్సీల ద్వారా మాత్రమే వీసాను పొందాలని సూచించారు. గల్ఫ్ కి వెళ్లే నిరుద్యోగ యువకులు అత్యవసర సమయంలో హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1800113090 లేదా 7428321144 వాట్సాప్ ద్వారా సంప్రదించి సందేహాలను అమృతం చేసుకోవాలని అన్నారు.

ప్రభుత్వ లైసెన్స్ లేని ఏజెంట్లు తక్షణమే లైసెన్స్ ను పొంది నిబంధనలకు లోబడిపనిచేయాలిని సరైన వీసా, డాక్యుమెంట్ లేనిది నిరుద్యోగ యువతను గల్ఫ్ దేశాలకు పంపించకూడదని ,నిబంధనలను పాటించని ఏజెన్సీలు మరియు ఏజెంట్ల పై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా అభ్యర్థులు ఏజెన్సీలచే మోసపోతే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి పోలీసు వారి సహాయం పొందాలని సూచించారు.


ఈ సందర్భంగా ఇమిగ్రేషన్ అదికారులు ఇమిగ్రేషన్ యాక్ట్ నియమనిబంధనల గురించి వివరిస్తూ, గల్ఫ్ ఏజెన్సీలు మరియు ఏజెంట్లు మరియు నిరుద్యోగ యువకులు బాధితులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు.  ఈ కార్యక్రమంలో డీఎస్పీ లు రఘు చందర్, ఉమామహేశ్వర రావు, రవీంద్ర కుమార్ , రంగ రెడ్డి, A.Ravi Kumar POE-II  (Protector of Emigrants) R. Krishna Kumar ASO, మరియు సి.ఐ లు, ఎస్.ఐ లు  ఏజెన్సీ ల సభ్యులు పాల్గొన్నారు.