24 గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండాలి !

👉ధర్మపురి ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !

👉రోగులకు వైద్య సిబ్బందికి భద్రత కల్పిస్తా !

J.SURENDER KUMAR,


ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా వైద్యులు సిబ్బంది కృషి చేయాలని, ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ధర్మపురి లోని స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఆసుపత్రిలోని గదులు పరిశీలించి, మందుల పంపిణీ, బెడ్స్, వైద్య సదుపాయాలు ఔట్ పేషెంట్ల వివరాలు వంటి తదితర వివరాలను వైద్యులను అడిగారు. డయాలసిస్ కేంద్రం ఐ సి యు కేంద్రాన్ని పరిశీలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగుల వార్డులను పరిశీలిస్తూ వారికి అందుతున్న వైద్య సేవల రోగులతో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడారు.


వైద్యులు రోగుల సమక్షంలోనే వైద్య విధాన పరిషత్ కమిషనర్ కు ఎమ్మెల్యే ఫోన్ చేసి ఆస్పత్రికి అదనంగా కావాల్సిన పరికరాలు, సౌకర్యాల కల్పన పట్ల వివరించారు. వారం రోజులో తాను, కలెక్టర్, వైద్యాధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలకు కావాల్సిన చర్యలు చేపట్టనున్నట్టు ఎమ్మెల్యే వైద్యులకు తెలిపారు.


👉ప్రధానంగా..


👉డెంగ్యూ, చికెన్ గున్యా నిర్ధారణ కిట్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఎమ్మెల్యే ఆదేశించారు.


👉పాముకాటు, కుక్క కాటు వ్యాక్సిన్ అందుబాటులో ఉంచడంతోపాటు రాత్రి వేళ తప్పనిసరి డ్యూటీ డాక్టర్ వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు.


👉ఆస్పత్రి ప్రాంగణంలో రోగులకు, వైద్య సిబ్బందికి రాత్రి 7 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు రక్షణగా, పోలీస్ శాఖ నుంచి కానిస్టేబుల్స్ నియమించాల్సిందిగా పోలీసు అధికారికి ఎమ్మెల్యే ఫోన్ చేసి ఆదేశించారు.


👉ఆస్పత్రిలో స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం కల్పించాలని వైద్యులను ఎమ్మెల్యే ఆదేశించారు.


వైద్యులు ఎమ్మెల్యే కు వైద్య సిబ్బంది ఆసుపత్రిలో పడకల సంఖ్య పెంచడం, వివరించారు. త్వరలో మాత శిశు కేంద్రంలో వైద్య సేవలు అందుబాటులో వచ్చేలా కృషి చేస్తాను అని ఎమ్మెల్యే అన్నారు.


సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మందులను అందుబాటులో ఉంచాలని, వైద్య సేవలు అందించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీ పడే ప్రసక్తి లేదని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ వైద్యులకు స్పష్టం చేశారు.