👉నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేసిన ప్రభుత్వ విప్
లక్ష్మణ కుమార్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ !
👉కృతజ్ఞతలు తెలిపిన జర్నలిస్టులు !
J.SURENDER KUMAR,
జగిత్యాల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించే బాధ్యత మా ప్రభుత్వంపై ఉందని జర్నలిస్టుల న్యాయమైన కోరిక అయిన ఇళ్ల స్థలాలను ఇప్పించే బాధ్యతను తామే తీసుకునీ సీఎం రేవంత్ రెడ్డి కలసి సమస్య వివరిస్తామని ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ లు అన్నారు.

ఇళ్ల స్థలాల సాధన కోసం జగిత్యాల జర్నలిస్టులు గత 18 రోజులుగా వివిధ రకాల నిరసన కార్యక్రమాలు నిర్వహించి 15 రోజుల నుండి జగిత్యాల ఆర్డీవో కార్యాలయం ఎదుట నిరవధిక నిరసన దీక్షను చేపట్టారు. జర్నలిస్టుల దీక్షలు 15 రోజులకు చేరిన నేపథ్యంలో ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ లు శనివారం దీక్షా శిబిరాన్ని సందర్శించి నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింప చేశారు.
👉 ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ

జర్నలిస్ట్ లది న్యాయమైన కోరిక అని,
జర్నలిస్టుల్లో చాలామంది బీద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారేనన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించదానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే ప్రభుత్వం జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల మంజూరి కోసం విధివిధానాలు ఖరారు చేస్తుందన్నారు.
జగిత్యాల చుట్టుప్రక్కల రెవెన్యూ భూములు లేవని, ఎస్సారెస్పీ కి చెందిన స్థలం మాత్రమే అందుబాటులో ఉన్నందున ఆ స్థలాన్ని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కోసం కేటాయించాలని జగిత్యాల జర్నలిస్టులు గత 15 రోజులుగా దీక్షలకు దిగినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.
జిల్లాకు చెందిన ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రి శ్రీధర్ బాబు, పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇతర ప్రజా ప్రతినిధులను సమన్వయం చేసుకొని ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెల్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్నారు.
ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని గత 15 రోజులుగా నిరవధిక నిరసన దీక్షను కొనసాగించారని, జర్నలిస్టుల సమస్యను పరిష్కరించదానికి తమ బాధ్యతగా భావించి కృషి చేస్తామన్నారు. జర్నలిస్టులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని, నిరసన దీక్ష విరమించాలని కోరారు.
👉ఈ సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ

జర్నలిస్టు ల ఇండ్ల స్థలాల మంజూరుకు అన్ని విధాలుగా కృషి చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి సమస్యని స్వయంగా తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. జర్న లిస్ట్ లకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమానికి కి అండగా ఉంటానని తనకు మాట ఇచ్చారన్నారు.
ఎస్ ఆర్ ఎస్పీ భూమి తన పరిది ని దాటి సీసీఎల్ఏ కు సంబంధించింది కాబట్టి ప్రభుత్వంలోని అందరు ప్రజాప్రతినిధుల సహకారంతో సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానన్నారు.
జర్న లిస్టు ల కోటా లో ఇళ్ళ విషయం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉందనీ,ఇండ్ల మంజూరుకు మనస్ఫూర్తిగా కృషి చేస్తానన్నారు.
👉కృతజ్ఞతలు!

దీక్ష శిబిరానికి వచ్చి నమ్మకాన్ని భరోసా కల్పించిన ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు జిల్లా జర్నలిస్టు యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసరావు, ప్రదీప్ కుమార్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాజగోపాల్ చారి, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యులు సురేందర్ కుమార్, జగిత్యాల పట్టణ ప్రెస్ క్లబ్ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు సంఘటన దినేష్, ఐజేయు జాతీయ సభ్యులు సురేంద్ర కుమార్, జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ప్రదీప్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గోపాల చారి, సీనియర్ జర్నలిస్టులు సంపూర్ణ చారి, మల్లారెడ్డి, సిరిసిల్ల వేణుగోపాల్, మధుసూదన్, బండ స్వామి, హనుమంతు పటేల్, లక్ష్మారెడ్డి, ఆనంద్, వంశీ, భానుక శ్రీనివాస్, రాజేష్, జహీర్, హరికృష్ణ, చింత లక్ష్మణ్, చింత నరేష్, సామ మహేష్,రాజి రెడ్డి, శ్రీనివాస్, లింగమూర్తి, ఇట్టే రాజు, రాజకుమార్, రంజిత్, రఘు, శంకర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.