👉మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ !
J.SURENDER KUMAR,
జగిత్యాల జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు చేపట్టిన నిరవధిక నిరసన కార్యక్రమం ఎనిమిదో రోజుకు నిరాహార దీక్ష చేరింది. మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ జర్నలిస్టులు చేపడుతున్న నిరసన శిబిరానికి శనివారం వచ్చి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
జర్నలిస్టులు చేస్తున్న పోరాటం న్యాయబద్ధమైనదని అన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధి లాంటి వారికి అన్యాయం జరగడం బాధాకరమన్నారు. గతంలో చాలాసార్లు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కొరకు న్యాయం జరిగేలా ప్రయత్నం చేశానని కొందరి వల్ల సాధ్యపడలేక పోయిందన్నారు. అది మీ అందరికీ తెలుసన్నారు ఇప్పటికైనా ఇళ్ల స్థలాలు సాధించే వరకు మీ వెన్నంటే ఉంటానని అన్నారు.
జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ దావా వసంత సురేష్ మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధులు అనుకుంటే అది సమస్యే కాదన్నారు ఈ సమస్యపై కావాలని దృష్టి పెడుతలేరన్నారు నాయకులు జడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ రావ్, మార్క్ ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపురెడ్డి, మాజీ జడ్పిటిసిలు జలంధర్, భూమన్న, సింగిల్ విండో చైర్మన్ మాధవరావు, పట్టణ మండల నాయకులు పాల్గొన్నారు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసపట్ల లక్ష్మీ నారాయణ, మున్సిపల్ కౌన్సిలర్ అనుముల్ల జయశ్రీ రఘు, గుంటి గంగారం, రాపర్తి రవి, సామల్ల సతీష్, రామచందర్, స్వర్ణకార సంఘం, బులియన్ అసోసియేషన్ నాయకులు గన్నేరువరం బుచ్చయ్య, ముమ్మడి నాగభూషణం, శేఖర్, గంగాధర్, గిరి ప్రవీణ్, రమేష్ భాస్కర్, వెంకటేశ్వర్లు జర్నలిస్టులకు సంఘీభావం తెలిపారు,
పి ఆర్ టి నాయకులు అమర్నాథ్ రెడ్డి, ఆనందరావు, వేణుగోపాలరావు, మల్లారెడ్డి, టి పి టి ఫ్ నాయకులు యాద రామకృష్ణ, దీక్షలో పాల్గొన్న జర్నలిస్టులు, పి కమలాకర్ రెడ్డి, గుడమల్లారెడ్డి, బైరి రాజేష్ గౌడ్, బొడ్డుపల్లి అంజయ్య, బెజ్జంకి సంపూర్ణ చారి, సిరిసిల్ల వేణుగోపాల్, జహీరుద్దీన్ హనుమంత్ పటేల్, కే లక్ష్మారెడ్డి, కోల హరీష్ గౌడ్, కడార్ల రంజిత్, మండలోజు ప్రసాద్ లకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు.
ఈ కార్యక్రమంలో,టి. యు.యూ.డబ్ల్యూ.జే, జగిత్యాలజిల్లా శాఖ అధ్యక్ష కార్యదర్శులు చీటీ శ్రీనివాసరావు, ఏ.ప్రదీప్ కుమార్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగుల గోపాలచారి లతోపాటు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు పాల్గొన్నారు