👉జిల్లాలో అర్హులైన జర్నలిస్టులకు న్యాయం చేస్తా !
👉ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇప్పించే బాధ్యత మా ప్రభుత్వంపై ఉంది జిల్లాలో అర్హులైన జర్నలిస్టులకు న్యాయం చేస్తా, మీరు ఇంటి స్థలాల కోసం నిరాహార దీక్షలు చేపట్టడం బాధాకరమైన విషయమని అతి త్వరలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఖాయమని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ అన్నారు

జగిత్యాల జిల్లా కేంద్రంలో జర్నలిస్టులు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష కార్యక్రమం నిర్విరామంగా ఆరవ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమానికి గురువారం ధర్మపురి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ హాజరై మాట్లాడుతూ, వరుసగా తొమ్మిది రోజుల నుండి కార్యక్రమాలు చేపట్టడం మమ్మల్ని చాలా బాద పెట్టింది, నేను ఎప్పటికీ జర్నలిస్టుల పక్షపాతిని, మీలో నేను ఒకడిని, జర్నలిస్టుల కష్టసుఖాలు నాకు తెలుసు, పదవిలో ఉన్నా లేకున్నా మీ వెంటే నేను ఉంటా, ఈ సమస్య పరిష్కారం చేసి ఇళ్ల స్థలాల కేటాయింపు జరిగేలా చేసి మీకు న్యాయం చేస్తానని జర్నలిస్టులను ఇళ్లస్థలాలు కేటాయించడంలో కొంతమేరకు జాప్యం జరిగిందన్నారు,

స్వల్ప కాలంలో మీకు ఇళ్ల స్థలాలు ఇప్పించే బాధ్యత నాపై ఉందన్నారు. జర్నలిస్టులు అన్యధా భావించొద్దు అని ఈ సందర్భంగా అన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్, అడువాలా జ్యోతి లక్ష్మణ్ మాట్లాడుతూ పాత్రికేయులు లేనిదే మాకు రాజకీయ జీవితం లేదు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయిస్తుందని ఆశాభవం వ్యక్తం చేశారు. వారితోపాటు మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు టి.విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం , మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కల్లేపల్లి దుర్గయ్య, మాజీ కౌన్సిలర్ గాజుల రాజేందర్, మాజీ సర్పంచ్ లు నిశాంత్ రెడ్డి, టి.శోభారాణి, కొండ్ర రామచంద్రారెడ్డిలు ఎమ్మెల్యే వెంట పాల్గొన్నారు. దీక్ష శిబిరానికి బుగ్గారం ప్రెస్ క్లబ్ పక్షాన దూడ జీవన్ మండల పాత్రికేయులు సంఘీభావం తెలిపారు.

దీక్షలో పాల్గొన్న బి సంపూర్ణ చారి, రవీందర్ రావు, ముంద మల్లేశం గౌడ్, హనుమంతు పటేల్, రంజిత్, లింగమూర్తి, కత్రోజు వినయ్, సాబీర్ గాజుల సత్యనారాయణ, వాసం రఘు, ప్రవీణ్, పాల్గొన్నారు. అఖిలభారత విశ్వకర్మ విశ్వకర్మ పరిషత్ సభ్యులు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చిటి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఏ ప్రదీప్ కుమార్ , స్టేట్ కౌన్సిల్ మెంబర్ రాగుల గోపాల చారి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా పత్రికలు పాల్గొన్నారు