జర్నలిస్టుల న్యాయమైన  డిమాండ్లు తీర్చాల్సిందే!

👉 జర్నలిస్టులకు సంఘీభావం తెలిపిన ప్రజా సంఘాలు !


J.SURENDER KUMAR,


జగిత్యాల పట్టణంలో జర్నలిస్టులు చేపట్టిన నిరవధిక రిలే నిరాహార దీక్ష నిరస కార్యక్రమం ఏడవ రోజుకు చేరుకుంది.  ఈ కార్యక్రమానికి  వివిధ ప్రజాసంఘాల నాయకులు సంఘీభావం ప్రకటిస్తూ మాట్లాడారు.  జర్నలిస్టులు చేపడుతున్న  నిరసన కార్యక్రమాలు న్యాయమైన కోరికలే అని ప్రజాస్వామ్యబద్ధంగా రావాల్సిన హక్కు అన్నారు.

జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు సమకూర్చడం ప్రభుత్వ బాధ్యత అని పలువురు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించకపోతే జర్నలిస్టుల పక్షాన ఎంతవరకైనా పోరాటం చేస్తామని పలువురు ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో  నాయి బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు మహేందర్,  రాజమౌళి, శ్రీనివాస్ , సాగర్, శ్రీనివాస్ సంఘ సభ్యులు  తెలుగుదేశం పార్టీ నాయకులు సామ నారాయణ రెడ్డి, అక్కినపల్లి కాశీనాథం, ఓరుగంటి భార్గవ్, నాయకులు రైతు సంఘం నాయకులు వేముల విక్రం రెడ్డి, షేర్ల మహేందర్, లక్ష్మీనారాయణ, కమలాకర్ రావు,  కరుణాకర్, సతీష్, విహెచ్ పి హిందు వాహిని వేముల నాయకులు సంతోష్ సభ్యులు పాల్గొన్నారు, ఎంఐఎం నాయకులు ఎండి యూనిస్ నదీమ్, నాయకులు హాజరై సంఘీభావం తెలిపారు. 

దీక్ష శిబిరంలో పాల్గొన్న ఎల్లాల   రాజేందర్ రెడ్డి, బద్ధం నారాయణరెడ్డి, సిరిసిల్ల వేణు గోపాల్,  కడార్ల రంజిత్, నీరటి గంగాధర్, సాదుల రవి,  మ్యాదరి నరహరి లకు అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు.  ఈ కార్యక్రమంలో  టి. యు.డబ్ల్యూ.జే, జిల్లా అధ్యక్షులు చిటి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఏ ప్రదీప్ కుమార్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాగుల గోపాల చారి, ప్రింట్ లతోపాటు ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయిలు పాల్గొన్నారు.