👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
మహిళలు స్వయంగా ఆర్థిక అభివృద్ధి సాధించడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నదని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAC) తెలంగాణ భవన మరియు కార్మిక సంక్షేమ మండలి సౌజన్యంతో వెల్గటూర్ మండలం గుల్లకోట గ్రామంలో మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరాన్ని బుధవారం ధర్మపురి ఎమ్మేల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆయన సతీమణి కాంత కుమారితో కలిసి ప్రారంభించారు.

ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…
తెలంగాణ రాష్ట్ర భవన మరియు కార్మిక సంక్షేమ మండలి ద్వారా ఏర్పాటు చేసిన ఉచిత కుట్టుమిషన్ శిక్షణ శిబిరాన్ని ప్రతి మహిళా వినియోగించుకోవాలని, కుట్టుమిషన్ శిక్షణకు సంబంధించి మహిళా సోదరీమణులు నన్ను కలిసి శిక్షణ గదికి అద్దె చెల్లించే విషయంలో కొంత ఇబ్బంది ఉందని వివరించారని ఎమ్మెల్యే అన్నారు.

శిక్షణ శిబిర గదికి సంబంధించిన అద్దె నేనే స్వయంగా చెల్లించి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందని, శిక్షణ అనంతరం వారికి సర్టిఫికెట్స్ తో పాటు కుట్టు మిషన్లు కూడా ఇవ్వడం జరుగుతుందని, ఎమ్మెల్యే అన్నారు.
ప్రస్తుతం 28 మంది మహిళలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, మరో విడతలో మరికొంత మందికి శిక్షణ ఇస్తామని, శిక్షణ విషయంలో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని ఈ సంధర్బంగా లక్ష్మణ్ కుమార్ అన్నారు.

ఈ కార్యక్రమంలో అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.