J.SURENDER KUMAR,
ఎస్సీ వర్గీకరణపై ఒ కమిటీని నియమించి, ఆ రిపోర్ట్ ఆధారంగా మాల మాదిగలు అందరికీ సమ న్యాయం జరిగేలా చూస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .హామీ ఇచ్చారు.
ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా మాల, మాదిగలకు సరైన న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ మాల సామాజికవర్గం ప్రజాప్రతినిధులు, మాల మహానాడు నేతలు అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రిని కలిశారు.

ఎస్సీ వర్గీకరణలో మాలలకు అన్యాయం జరగకుండా చూడాలని వారు అభ్యర్థించారు. ముఖ్యమంత్రి ని కలిసినవారిలో ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి , మట్టా రాగమయి , చిక్కుడు వంశీకృష్ణ , కేఆర్ నాగరాజు , ఎంపీ గడ్డం వంశీ , మాల మహానాడు నేతలు చెన్నయ్య తదితరులు ఉన్నారు.