మంత్రి శ్రీధర్ బాబును అభినందించిన ఎమ్మెల్యే,ఎమ్మెల్సీ లక్ష్మణ్ కుమార్ జీవన్ రెడ్డి!

J.SURENDER KUMAR,


తెలంగాణ రాష్ట్రాన్ని పారిశ్రామిక సాంకేతిక రంగాల్లో పరుగులు పెట్టించడానికి, పారిశ్రామికవేత్తలతో పెట్టుబడుల కోసం విదేశీ పర్యటన మంత్రి శ్రీధర్ బాబు ను ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లు అభినందించారు


వివిధ రంగాలలో దాదాపు ₹ 31,500 కోట్ల పెట్టుబడు ల కోసం సీఎం రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు పది రోజులపాటు పర్యటించిన విషయం తెలిసిందే.


విదేశ పర్యటనను విజయవంతంగా ముగించుకొని వచ్చిన మంత్రి శ్రీధర్ బాబు ను గురువారం కరీంనగర్ లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , MLC జీవన్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలసి పూల బొకే అందించి శాలువాలతో సన్మానించారు, వీరి వెంట ధర్మపురి, గొల్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగనపట్ల దినేష్, నిశాంత్ రెడ్డి పలువురు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.