👉మా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తుంది.!
👉జగిత్యాల జిల్లాలోని ప్రతి రంగాన్ని అభివృద్ధి చేస్తాం!
👉ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
మా ప్రభుత్వం పెద ప్రజల సంక్షేమానికి, అన్ని రంగాల అభివృద్ధికి కట్టుబడి ఉంది .రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నా మని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
78వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన వేడుకల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ స్వాగతం పలికారు, మొదటగా పోలీస్ అధికారుల గౌరవ వందనాన్ని స్వీకరించి, విప్ హోదాలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ని, జిల్లా కలెక్టర్, మరియు ఎస్పీతో కలిసి పరిశీలించి చిన్నారుల నృత్య ప్రదర్శనలు వీక్షించారు, అనంతరం వివిధ శాఖల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు ప్రశంస పత్రాలను అందజేశారు.

ఈ సంధర్బంగా ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, తన ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు జరిగిన అభివృద్ధినీ వివరించారు. రాష్ట్ర ప్రజానీకానికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
👉ప్రసంగంలో వివరాలు..
ఇచ్చిన హామీల ప్రకారం ఆరు గ్యారెంటిలలో భాగంగా మహా లక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, మరియు ఆరోగ్య శ్రీ పరిధి 10 లక్షలకు పెంపు, గృహ జ్యోతి ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్,₹ 500లకే గ్యాస్ సిలిండర్, పెద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు వంటి హామీలను అమలు చేయడం జరిగిందని, రైతులకు రెండు లక్షల రూపాయల రుణాలను మాఫీ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు మొదటి విడతలో ₹1 లక్ష రూపాయలు, రెండో విడతలో ₹1లక్ష,50 వేల రూపాయలను మఫి చేయడం జరిగిందని, నకిలీ విత్తనాలు, ఎరువులు సరఫరా అరికట్టే విధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, విద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేయడం జరిగిందనీ, గురుకులాల్లో విధ్యార్థులకు మౌలిక వసతుల కల్పనతో పాటు నాణ్యమైన బోజనాన్ని అందించడం జరుగుతుందని, ప్రసంగంలో పేర్కొన్నారు.

వన మహోత్సవం కింద 24 లక్షలకు పైగా మొక్కలు నాటడంతో పాటు ప్రతి ఇంటికి 6 మొక్కల చొప్పున 12 లక్షల మొక్కలు పంపిణీ చేయడం జరిగిందని, పారిశ్రామిక పరంగా టీ.జి ఐ పాస్ ద్వారా జిల్లాలో 74 పరిశ్రమలు, మరియు 103 అనుమతుల్లో 102 అనుమతులు ఇవ్వడం జరిగిందనీ, రాష్ట్ర ప్రభుత్వం పెద ప్రజల సంక్షేమానికి, అన్ని రంగాల అభివృద్ధికి కట్టుబడి ఉందని ఈ సందర్భంగా తెలిపారు..