మున్నూరు కాపు సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం!

👉మున్నూరు కాపు ఫెడరేషన్ ఏర్పాటు చేసి ₹50 కోట్లు కేటాయించింది సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం!


👉ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్!


J.SURENDER KUMAR

మున్నూరుకాపు సంక్షేమమే నా ప్రభుత్వ లక్ష్యమని మొట్టమొదటిసారి మున్నూరు కాపు సంఘ ఫెడరేషన్ ఏర్పాటు చేసి ₹ 50 కోట్ల కేటాయించింది సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.
ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


జగిత్యాల జిల్లాలోని బండారి గార్డెన్స్ లో ఆదివారం జరిగిన జగిత్యాల జిల్లా నూతన మున్నూరు కాపు సంఘ కార్యవర్గ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, నిజాంబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్,ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జగిత్యాల మున్సిపల్ చైర్మన్ అడువల జ్యోతి తో కలిసి పాల్గొన్నారు.


ఈ సంధర్బంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ…


గ్రామాల్లోఎవరికి ఎటువంటి కష్టం వచ్చిన ముందుండే వారు మా మున్నూరు కాపు సోదరులనీ, నూతనంగా జగిత్యాల జిల్లా మున్నూరు కాపు సంఘ కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు తెలిజేస్తున్నమని, మున్నూరు కాపు సంఘ భవన నిర్మాణానికి సహకారం అందించాలని మమల్ని కోరడం జరిగిందనీ వారి సంఘ భవన నిర్మాణంలో ప్రభుత్వం నుండి ఎటువంటి సహకారం అవసరం ఉన్న అందించడానికి సిద్ధంగా ఉన్నామని, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ శ్రీధర్ బాబు నేతృత్వంలో మీకు అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు.


ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు కార్యవర్గ సభ్యులు, సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు