పార్లమెంట్ కాంప్లెక్స్ లో ప్రశాంత వాతావరణ !

J.SURENDER KUMAR,


పార్లమెంట్ భవన కాంప్లెక్స్ లో అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు పరస్పరంగ నవ్వుతూ ముచ్చటిస్తూ కలసి టి సేవిస్తూ కెమెరాలకు ఫోజులు ఇచ్చిన దృశ్యం శుక్రవారం పార్లమెంట్ కాంప్లెక్స్ లో చోటు చేసుకుంది.


కొన్ని రోజుల క్రితం వరకు లోక్‌సభలో మాట్లాడుతున్నప్పుడు ప్రధాని మోదీ, రాహుల్‌ గాంధీ మధ్య పదునైన మాటల తూటాలు పేలిన సంగతి తెలిసిందే. రసవత్తరమైన ఎన్నికల ప్రచారానికి, రెండు ప్రత్యర్థి పార్టీల మధ్య జరుగుతున్న హోరాహోరీ పోరుకు ఎదురు ఎదురుగా నాయకులు కూర్చుండి ప్రజా సమస్యలపై ముచ్చటించుకున్నారు.
లోక్‌సభ శుక్రవారం వాయిదా పడిన తర్వాత, బడ్జెట్ సమావేశాలు ముగియడానికి ముందు, పార్లమెంట్ కాంప్లెక్స్‌లో అనధికారిక టీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు.


ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు ఆగస్టు 12న ముగియాల్సి ఉండగా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభను (నిరవధిక) వాయిదా వేశారు.
సమావేశానికి హాజరైన నాయకులు మాట్లాడుతూ,ఒకరినొకరు నమస్తేల తో పలకరించుకున్నారు
ప్రధాని సోఫాలో కూర్చున్నారు, ఆయన పక్కనే స్పీకర్ ఓం బిర్లా ఉన్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీకి కుడివైపున కుర్చీలో కూర్చున్నారు.
మంత్రులు కిరణ్ రిజిజు, కింజరాపు రామ్మోహన్ నాయుడు, చిరాగ్ పాశ్వాన్, పీయూష్ గోయల్‌తో పాటు ప్రతిపక్ష ఎంపీలు సుదీప్ బందోపాధ్యాయ, కనిమొళి కూడా రాహుల్ గాంధీ కూర్చున్న వరుసలో కూర్చున్నారు.


అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్‌లు ప్రతిపక్ష నేతకు అది ముఖంగాఅది ముఖంగా కూర్చున్నారు.
నాయకులు తమలో తాము మాట్లాడుకుంటు టీ తాగారు.


(ఎన్డీటీవీ సౌజన్యంతో )