👉విద్యార్థి మృతి చాలా బాధాకరం !
👉ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ !
J.SURENDER KUMAR,
కోరుట్ల నియోజకవర్గం పెద్దపూర్ గురుకుల హాస్టల్ విద్యార్థి మృతి పట్ల సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు ప్రభుత్వ పరంగా చేపడుతామని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఏ .లక్ష్మణ్ కుమార్ అన్నారు.
హాస్టల్ లో ముగ్గురు విధ్యార్థులు అస్వస్థత గురై కడుపు నొప్పితో బాధబడుతూ వారిలో ఓ విద్యార్థి మృతి చెందిన విషయం తెలుసుకున్న
ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు జువ్వాడి కృష్ణ రావు, అదనపు కలెక్టర్, రెవెన్యూ డివిజన్ అధికారి జిల్లా వైద్యాధికారి తో కలసి శుక్రవారం పెద్దాపూర్ వసతి గృహాన్ని సందర్శించారు. హాస్టల్లోని గదులను, వంట గదిని పరిశీలించి విద్యార్థులతో, ఇన్చార్జి ప్రిన్సిపాల్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం జగిత్యాల జిల్లా సివిల్ హాస్పిటల్లో ఉన్న విద్యార్థి మృత దేహానికి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
విద్యార్థి మృతి విద్యార్థులు అస్వస్థత ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదికను అందించాలని అధికారులను అదేశిస్తున్నమని, భాద్యులు ఎవ్వరైనా వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఎప్పుడు గురుకుల హాస్టల్లో ఉన్న విద్యార్థుల గురించి, వారి వసతుల గురించి అసెంబ్లీలో కనీసం ప్రస్తావించలేదని, మేము విధ్యార్థులకు మెస్ బిల్లులు చెల్లించాలని అసెంబ్లీలో అడగటం జరిగిందని, ఎది ఏదైనప్పటికీ ఇది రాజకీయ కోణంలో చూడాల్సిన విషయం కాదని,

విద్యార్థుల భవిష్యత్తుకు సంబందించిన విషయం కాబట్టి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ కలిసి వారి దృష్టికి తీసుకెళ్తామని, రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల వసతి విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తి ఉండదని, తాత్కాలిక ప్రతిపాదికను ఈ వసతి గృహంలో అవసరమైన మౌలిక వసతులు అందించాలని ఆదేశించారు. విద్యార్థుల తల్లిండ్రులు ఎటువంటి అధైర్య పడాల్సిన అవసరం లేదని, మీ పిల్లలకు అన్ని విధాలా అండగా మేము ఉంటామని, ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు