పోలీస్ గన్ మ్యాన్ లకు మామూళ్ల బెడద ?

👉ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అధికారి తీరే వేరు !


J.SURENDER KUMAR,


చట్టసభల ప్రతినిధులకు అంగరక్షకులైన కొందరు పోలీస్ గన్ మ్యాన్ ల ను మామూళ్ల బెడద వెంటాడుతున్నది. ఈ మామూళ్ల బెడద పోలీసులతో ప్రజలకో, వ్యాపారులకో కాదు ఆ శాఖలో ఓ అధికారి తీరుతో గన్ మెన్లు కు ఈ బెడద మొదలైందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


క్రమశిక్షణ గల ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న తాము తమ సాధక, బాధకాలను తమ పై అధికారికి (ఇమీడియట్ బాస్) చెప్పుకోవాలి, తప్ప ఆపై అధికారికి వివరించడానికి వీలు లేని దుస్థితి. ఈ బలహీనత దుస్థితిని అడ్డుపెట్టుకొని ఆ అధికారి తమను మామూళ్ల కోసం టార్చర్ పెడుతున్నాడని అని గన్ మెన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


👉వివరాలు ఇలా ఉన్నాయి..

ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని ఓ జిల్లా లో చట్టసభల ప్రజా ప్రతినిధులకు పోలీస్ గన్ మెన్లను ( అంగరక్షకులు) కేటాయించే కీలక బాధ్యతగల అధికారి, తనను ప్రసన్నం చేసుకొని తృణమో , ఫలమో సమర్పించుకునే వారినే గన్ మేన్లు గా పోస్టింగ్ ఇస్తున్నాడు అని బాధిత గన్ మెన్లు మదన పడుతున్నారు. దీనికి తోడు ప్రతినెల విధిగా తృణమో , ఫలమో ఇచ్చుకోవాలని అధికారి టార్చర్ పెట్టడం నిత్య కృత్యంగా మారింది అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అనుక్షణం అప్రమత్తంగా విధులు నిర్వహిస్తూ ప్రజాప్రతినిదుల ప్రాణాలకు, తమ ప్రాణాలు పణంగా పెట్టి, కంటికి రెప్పలా కాపలా విధులు నిర్వహించే గన్ మెన్లకు నాలుగు రోజులు కు ఓసారి వారికి నాలుగు రోజులపాటు విధులు ఉండవు. ఈ సమయంలో పోలీస్ హెడ్ క్వార్టర్ లో ఉదయం సాయంత్రం రన్నింగ్, వామప్ ( ఉదయం , సాయంత్రం రెండు గంటలు ) చేసి ఇంట్లో కుటుంబ సభ్యులతో ఉండే వెసులుబాటు ఉంటుంది. సిబ్బంది కొరత, అధికారుల ఆదేశాల నేపథ్యంలో తాము శాంతి భద్రతలు తదితర విధులను రెండు రోజులపాటు నిర్వహిస్తున్నామని వారు వివరిస్తున్నారు.

ప్రతినెల అధికారి మామూళ్లు ఇవ్వాలని వేధించడం, తాము ఇవ్వకుంటే భరించలేని మాటల టార్చర్ తో పాటు హెడ్ క్వార్టర్ అటాచ్ చేస్తాం, మీ డ్యూటీ ఇక్కడ వేస్తా, మీరు ఆ ప్రజా ప్రతినిధి వద్దకు వెళ్ళవద్దు, అంటూ వేధింపులకు గురి చేస్తున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


గత కొన్ని రోజుల క్రితం ట్రాఫిక్ నియంత్రణలో సిబ్బంది కొరత ఉందని, ఇద్దరు కానిస్టేబుల్ అవసరం ఉందని ఆ శాఖ నుంచి కానిస్టేబుల్స్ ను కేటాయించమని కోరారు. సివిల్ కానిస్టేబుల్స్, ట్రాఫిక్ కు కేటాయించాల్సి ఉండగా. ఏ ఆర్ ( ఆర్ముడ్ రిజర్వ్) మెన్స్ ను ట్రాఫిక్ విభాగానికి ఈ అధికారి కేటాయించినట్టు చర్చ. ట్రాఫిక్ లో విధులు నిర్వహించే వారికి అదనంగా 30 శాతం అలవెన్స్ సౌలభ్యం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇద్దరు ఏఆర్ కానిస్టేబుల్స్ ను ట్రాఫిక్ కు అధికారి కేటాయించినట్టు ఆరోపణలు ఉన్నాయి.


ప్రముఖులు, వీఐపీల పర్యటనల సందర్భంగా
B. D.T ( బాంబు డిస్పోజల్ టీమ్ ) లో విధులు నిర్వహించడానికి నెల రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఉంటుంది ఈ శిక్షణకు కానిస్టేబుల్ లను ఎంపిక చేసి పంపించడానికి తనను ప్రసన్నం చేసుకున్న కానిస్టేబుల్ కే అవకాశం ఇచ్చినట్టు గన్ మెన్లు ఆరోపిస్తున్నారు.


ఇది ఇలా ఉండగా గతంలో ఈ అధికారి పోలీస్ శిక్షణ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో పోలీసులు పట్టుకున్న ఇసుక ట్రాక్టర్లలో ఇసుక, ట్రాక్టర్ మరమ్మత్తు పరికరాలు. గార్డెనింగ్ పనుల పరికరాలు, అదృశ్యం అయిన ఆరోపణలపై ఈ అధికారి ని ఉత్తర తెలంగాణ జిల్లాలో ఓ జిల్లాకు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా బదిలీ చేశారని బాధితుల ఆరోపణలు. తిరిగి ఈ అధికారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు బదిలీ చేయించుకున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఈ అధికారి వేధింపుల తీరును, తాము గన్ మేన్లుగా విధులు నిర్వహిస్తున్న ప్రజాప్రతినిధి కి వివరించడంతో, తాను త్వరలో రాష్ట్ర కీలక ఉన్నతాధికారితో మాట్లాడుతాను మీరు ఆందోళన చెందవద్దని ఆ ప్రజా ప్రతినిధి వీరిని ఓదార్చినట్టు సమాచారం.


ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని అధికారి తీరుపై విచారణ జరిపి చర్యలు తీసుకొని తమను అధికారి వేధింపులు, మామూళ్ల భారీ నుండి కాపాడాల్సింది గా బాధిత గన్ మెన్లు జిల్లా ఉన్నతాధికారిని వేడుకుంటున్నారు.