ప్రభుత్వ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యానికి CWEIC ఆసక్తి!

J.SURENDER KUMAR,


తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన ప్రాజెక్టుల్లో వ్యూహాత్మక భాగస్వామిగా ఉండేందుకు కామన్వెల్త్ ఎంటర్‌ప్రైజ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కౌన్సిల్ (CWEIC) ఆసక్తి చూపింది.
తెలంగాణలో ప్రజాప్రభుత్వం నూతనంగా చేపట్టిన ప్రాజెక్టులపై కామన్వెల్త్ కూటమిలో భాగమైన కామన్వెల్త్ ఎంటర్‌ప్రైజ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కౌన్సిల్ (CWEIC) ఆసక్తి కనబర్చింది
.

సచివాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని CWEIC చీఫ్ ఎగ్జిక్యూటివ్ రోసీ గ్లేజ్‌బ్రూక్ (Rosie Glazebrook) మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ భేటీలో పెట్టుబడులు, నైపుణ్యాల అభివృద్ధి తదితర అంశాలు చర్చకు వచ్చాయి.


ప్రపంచ వ్యాప్తంగా 56 కామన్వెల్త్ దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడుల విస్తరణ కు CWEIC కృషి చేస్తోందని, ప్రత్యేకించి చిన్న-మధ్యతరహా పరిశ్రమ (MSME) లకు ప్రోత్సాహం, స్టార్టప్‌లు, నైపుణ్యాల అభివృద్ధికి తోడ్పాలు అందిస్తోందని రోసీ గారు తమ CWEIC కౌన్సిల్ ఉద్దేశాలను ముఖ్యమంత్రి కి వివరించారు.


తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన రీజినల్ రింగ్ రోడ్డు (RRR), ఫ్యూచర్ సిటీ నిర్మాణం, మూసీ నది ప్రక్షాళన తదితర ప్రాజెక్టులపై ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన విజన్‌ను పంచుకున్నారు. ఈ సమావేశంలో పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.