ఎస్సీ వర్గీకరణ అమలు కు కార్యాచరణ ప్రణాళిక!

👉దామోదర్ రాజనర్సింహ నేతృత్వంలో సమావేశం !


👉సమావేశంలో మంద కృష్ణ మాదిగ !


J.SURENDER KUMAR,


తెలంగాణ లో ఎస్సీ వర్గీకరణ అమలులోకి తీసుకురావడం కోసం చేయాల్సిన కార్యాచరణ ప్రణాళిక , ఎస్సీ వర్గీకరణ మీద ఇప్పటి వరకు జరిగిన, జరుగుతున్న, జరగాల్సిన పరిణామాల పై గురువారం మంత్రి దామోదర్ రాజనర్సింహ నేతృత్వంలో సమావేశం జరిగింది.


హైదరాబాద్లోని మంత్రి నివాసంలో జరిగిన సమావేశంలో మాదిగ ప్రజాప్రతినిధులు, మంద కృష్ణ మాదిగ తో కలిసి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.
ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనుసరించి తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను అమలు చేసుకోవడానికై చేపట్టాల్సిన విధివిధానాలపై మాదిగ ప్రజాప్రతినిధులు కసరత్తు చేశారు. సమావేశ అనంతరం ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డిని వీరు మర్యాదపూర్వకంగా కలిసారు