ఎస్సీ వర్గీకరణ న్యాయపోరాటంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే…


J.SURENDER KUMAR,


ఎస్సీ వర్గీకరణ పై మంగళవారం సుప్రీం కోర్టులో ఏడుగురు న్యాయముర్తుల బెంచి ముందు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ప్రముఖ సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించనున్న నేపథ్యంలో మంత్రి దామోదర రాజనర్సింహ నాయకత్వంలో ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మనకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపెల్లి సత్యనారయణ, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు , ఫిబ్రవరి 4న  ఢిల్లీకి వెళ్లారు.

మంత్రి దామోదర్ రాజనర్సింహ ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అడ్వకేట్ జనరల్ తో చర్చిస్తున్న దృశ్యం (ఫిబ్రవరి 3న ఫైల్ ఫోటో)


దళితులలో జనాభా ప్రాతిపాదికన ABCD వర్గికరణ అంశంపై ఫిబ్రవరి 3న హైదరాబాదులో ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ను మంత్రి దామోదర్ నరసింహ, ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, కలసి వర్గీకరణ అమలు జాప్యంతో మాదిగ యువత విద్య, ఉద్యోగ, ఉపాధి, రాజకీయ అంశాల్లో నష్టపోతున్న ఉదంతాల నివేదిక ను అడ్వకేట్ జనరల్ కు వివరించారు. ప్రభుత్వ పక్షాన సుప్రీం కోర్టులో వాదనలు ఉన్న నేపథ్యంలో అడ్వకేట్ జనరల్ కు ముందస్తు ఫీడ్ బ్యాక్ అందించారు.