సౌదీ అరేబియా మాజీ రాజు అబ్దుల్లాకు కృతజ్ఞతలు !

👉2023 నాటికి, ఖలీద్ బరువు 542 కిలోలు !

👉ప్రస్తుతం అతడి బరువు 63.5 కిలోలు !


J.SURENDER KUMAR,


సౌదీ అరేబియా మాజీ రాజు అబ్దుల్లాకు ఖలీద్ బిన్ మొహసేన్ షరీ కృతజ్ఞతలు తెలిపారు. ఒకప్పుడు ప్రపంచంలో సజీవంగా ఉన్నవారిలో అత్యంత బరువైన వ్యక్తిగా పేరుగాంచిన ఖలీద్ బిన్ మొహసేన్ షరీ 542 కిలోల బరువు తగ్గాడు.


👉వివరాల్లోకి వెళ్తే..


2013లో, ఖలీద్ 610 కేజీల బరువుతో ప్రాణాపాయంతో మూడేళ్ళపాటు మంచానపడ్డాడు. అతను తన ప్రాథమిక అవసరాలకు కూడా స్నేహితులు, కుటుంబ సభ్యులపై ఆధారపడే దుస్థితి. అతని పరిస్థితి దిగజారింది. ఖలీద్ యొక్క దుస్థితికి చలించిపోయిన రాజు అబ్దుల్లా అతని ప్రాణాలను కాపాడటానికి సమగ్ర ప్రణాళికతో కార్యాచరణకు శ్రీకారం చుట్టారు.


ఖలీద్‌కు ఎటువంటి ఖర్చు లేకుండా ఉన్నత స్థాయి వైద్యం అందేలా రాజు ఏర్పాటు చేశాడు. ఖలీద్‌ను జజాన్‌లోని అతని ఇంటి నుండి ఫోర్క్‌లిఫ్ట్ , ప్రత్యేకంగా రూపొందించిన బెడ్‌ ద్వారా రియాద్‌లోని కింగ్ ఫహద్ మెడికల్ సిటీకి తరలించారు. కఠినమైన చికిత్స, ఆహార నియమావళి అమలు చేశారు. 30 మంది వైద్య నిపుణుల బృందం సమావేశమై ఖలీద్ కు అందించాల్సిన వైద్య చికిత్స పై నిరంతరం చర్చిస్తూ ప్రగతిని పరిశీలిస్తూ ఖలీద్ కు గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ, కస్టమైజ్డ్ డైట్, ఎక్సర్ సైజ్ ప్లాన్ మరియు ఇంటెన్సివ్ ఫిజియోథెరపీ సెషన్‌లు అతని శరీరంలో యథాస్థితికి రావడానికి శ్రమించారు. ప్రముఖ మధ్యప్రాచ్య శాస్త్రవేత్తల సహకారంతో, ఖలీద్ అద్భుతమైన శరీరం లో మార్పులు చేయగలిగారు.

63 కిలోల బరువుతో ఖలీద్


ఒకప్పుడు జీవించి ఉన్నవారిలో అత్యంత బరువైన వ్యక్తి మరియు జీవించిన వారిలో రెండవ అత్యంత బరువైన వ్యక్తి అయిన ఖలీద్ బిన్ మొహసేన్ షరీ కేవలం ఆరు నెలల్లోనే దాదాపు సగం శరీర బరువు తగ్గి అసాధారణమైన స్థితికి చేరుకున్నాడు.


2023 నాటికి, ఖలీద్ 542 కిలోల బరువు తగ్గి 63.5 కిలోలకు చేరుకున్నాడు. అతనికి అనేక అదనపు చర్మ తొలగింపు శస్త్రచికిత్సలు అవసరమవుతాయి అని వైద్యులు భావించారు., అతను “ది స్మైలింగ్ మ్యాన్” అని ముద్దుగా పిలిచారు. , అతని అద్భుతమైన శరీర పరివర్తనను చూసిన వైద్య సిబ్బంది ముద్దు పేరు.


( NDTV సౌజన్యంతో)