స్థలాల కోసం జగిత్యాల  జర్నలిస్టుల నిరాహార దీక్షలు !

J.SURENDER KUMAR,


ఇంటి స్థలాల కోసం జగిత్యాల జర్నలిస్టులు రిలే నిరాహార దీక్షల బాట పట్టారు. జిల్లా కేంద్రంలో తహసిల్ చౌరస్తాలో  నిరసన లో భాగంగా ఐదవ రోజు ఆర్డిఓ కార్యాలయం ఎదుట శనివారం రిలే నిరసన దీక్ష  చేపట్టారు.  కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాత్రికేయులు  పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.   అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని దీక్ష శిబిరం ప్రారంభించారు .

ఈ సందర్భంగా ఐజేయు జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు మాట్లాడుతూ, పాత్రికేయులకు  ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న జర్నలిస్టులకు ఇప్పటివరకు న్యాయం జరగలేదని ఈ సందర్భంగా అన్నారు . జర్నలిస్టులకు  దక్కాల్సిన ఇళ్ల స్థలాల కోసం ఎన్నో ఏళ్లుగా ఎంతోమంది ప్రజాప్రతినిధులకు, వివిధ సందర్భాల్లో  అధికారులకు వినతి పత్రాలు సమర్పించి అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు.

అయినప్పటికీ ప్రభుత్వపరంగా ఇంతవరకు  జర్నలిస్టుకు  ఇళ్ల స్థలాలను పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు కేటాయించే విధంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు  కృషి చేయాలని కోరారు, ఈ కార్యక్రమంలో,  జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ. ప్రదీప్ కుమార్, టి.యు.డబ్ల్యూ.జే. స్టేట్ కౌన్సిల్ మెంబర్  రాగుల గోపాల చారి, ల తోపాటు  సీనియర్ పాత్రికేయులు, పి ఎస్ రంగారావు, టీవీ సూర్యం సిరిసిల్ల శ్రీనివాస్ , కే మహేష్ కుమార్ , సంపూర్ణ చారి, మల్లారెడ్డి, కమలాకర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, రాజేందర్ రెడ్డి, జిల్లా సత్యం,  సందీప్ రావు, బైరి రాజేష్, గడ్డల హరికృష్ణ, బండ స్వామి, పాము సత్యం, దేవేందర్, వేణుగోపాల్, శ్రీధర్ రావు, సిరిసిల్ల రాజేందర్ శర్మ,  జహీరుద్దీన్,, నరేష్, కోలా హరీష్ గౌడ్, సట్ట శ్రీనివాస్,  ప్రసాద్, రంజిత్, ఆనంద్, రాజిరెడ్డి, లక్ష్మణ్, సాజిత్, భానుక  శ్రీనివాస్, నారాయణరెడ్డి, ఇక్రమొద్దిన్ స్వామి ,ఫజల్, హైదర్,, లింగమూర్తి, శ్రవణ్, భరత్ కుమార్, నరహరి  ఎస్ రవి తదితరులు పాల్గొన్నారు


👉మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సంఘీభావం !


జగిత్యాల మున్సిపల్ మాజీ చైర్పర్సన్ , బిజెపి  రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ భోగ శ్రావణి, నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఇండ్ల సాధన ఉద్యమ పోరాటానికి మద్దతుగా మొదటి రోజున ₹14, 140/- శిబిరాన్ని సందర్శించిన వారు ( ఉద్యమ నిది గా ) అందించారు.