తెలుగు కళాశాల భవన మరమ్మతులు త్వరగా పూర్తి చేయండి !

👉ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,

ధర్మపురి పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి సంస్కృతాంధ్ర తెలుగు కళాశాల భవన మరమత్తు పనులు త్వరగా పూర్తి చేయాలి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రభాకర్ ను స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశించారు.


గత కొన్ని సంవత్సరాలను మూతపడిన ఇటీవల పునః ప్రారంభించిన సంస్కృతాంధ్ర తెలుగు కలశాలను శుక్రవారం ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పరిశీలించారు. కళాశాలలో కొనసాగుతున్న పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన పనులను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.


👉మైనార్టీ వెల్ఫేర్ సొసైటి కమ్యూనిటీ భవనం ప్రారంభం !


ధర్మపురి పట్టణంలోని మైనార్టీ వెల్ఫేర్ సొసైటి కమ్యూనిటీ భవనం ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ విప్ గా ఈ హోదాలో ఉన్నానంటే అది నియోజకవర్గ ప్రజలు మరియు మీ అందరి సహకారం వల్లనే అని అన్నారు.


మైనార్టీ సోదరులకు సంబందించిన మైనార్టీ వెల్ఫేర్ సొసైటి కమ్యూనిటీ భవనం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, మైనార్టీ సోదరులకు ఎటువంటి ఇబ్బందులూ ఉన్న తన దృష్టికి తీసుకురావాలని, ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయ సహకారం అవసరం ఉన్న తప్పకుండా అందిస్తానన్నారు.

త్వరలోనే ధర్మపురిలో అన్ని వర్గాల పిల్లల కొరకు ఇంటిగ్రేటడ్ వసతి గృహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్టు ఈ సంధర్బంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు కార్యకర్తలు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.