👉కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నరసింగరావు!
J.SURENDER KUMAR,
జగిత్యాల పట్టణంలోని జర్నలిస్టులు ఇండ్ల సాధన కోసం చేస్తున్న దీక్ష 13 రోజులకు చేరుకుంది. గురువారం కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి జువ్వాడి నరసింగరావు హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రావడానికి జర్నలిస్టులు ముఖ్యకారకులన్నారు.
గత పాలకులు జర్నలిస్టుల సమస్యలను విస్మరించారని అన్నారు. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇది పేదల ప్రభుత్వం. జర్నలిస్టులు పెద్ద గొంతెమ్మ కోరికలు కోరాట్లేదని, కేవలం అర్హులైన వారికి ఇండ్ల స్థలాలు మాత్రమే కోరుతున్నారని అన్నారు. ఇది న్యాయమైన కొరికనే, ఇక్కడ ఉన్న పెద్దలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, విప్ లక్ష్మణ్ కుమార్ అందరం తప్పకుండా మీకు అండగా ఉంటామన్నారు. సీఎం తో మీ సమస్యను వివరించి పరిష్కారమయ్యే లా చూస్తామని హామీ ఇచ్చారు. జర్నలిస్టులు దీక్ష విరమించాలని కోరారు.
👉దీక్ష శిబిరం ముందు సాదాసీదాగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించిన జర్నలిస్టులు!

గత 13 రోజులుగా ఇండ్ల స్థలాల సాధన కోసం జర్నలిస్టులు దీక్షలు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దీక్ష శిబిరం ముందు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సాదా సీదాగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు ఆవిష్కరించారు. అనంతరం జర్నలిస్టులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి ఏటా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించుకునే వారమని ఈ స్వాతంత్ర దినోత్సవం ఇంత నిరాడంబరంగా జరుపుకోవడం బాధ కలుగుతుందని అన్నారు. తమ ఇండ్ల సాధన దీక్షలు విజయవంతం అవుతాయని అందరూ ప్రజా ప్రతినిధులు సానుకూలంగా స్పందిస్తూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారని దీంతో కొద్ది రోజుల్లోనైనా తమ సొంత ఇంటి కల నెరవేరుతుందనే నమ్మకం తమకు కుదురుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు