తిరుమలలో ఘనంగా గరుడ పంచమి వేడుకలు !

J.SURENDER KUMAR,

తిరుమల తిరుపతి  దేవస్థానంలో గరుడ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఘనంగా వేడుకలు జరిగాయి. శ్రీ మలయప్ప స్వామి గరుడ వాహనంపై విహరించారు. శుక్రవారం సాయంత్రం నాలుగు మాడ వీధుల్లో గరుడ వాహనంపై ఉత్సవమూర్తులను ఆశీనులు గావించారు.

తిరుమల పీఠాధిపతులు, అడిషనల్ ఈవో  సిహెచ్ వెంకయ్య చౌదరి, సివిఎస్‌వో  శ్రీధర్, ఆలయ డిఇవో  లోకనాథం తదితరులు పాల్గొన్నారు.

👉కశ్యప జయంతి..


టిటిడి ఆళ్వార్ దివ్యప్రబంధ ప్రాజెక్టు, శ్రీ వైఖానస దివ్య సిద్ధాంత వివర్ధిని ప్రాజెక్టు ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం తిరుమలలోని ఆస్థాన మండపంలో శ్రీ కాశ్యప మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వైఖానస సభ కార్యదర్శి  శ్రీనివాస దీక్షితులు, శ్రీ విఖానస ట్రస్టు కార్యదర్శి  ప్రభాకరాచార్యులు తదితరులు మాట్లాడారు.