👉భక్తులు స్థానికులు నీటి వృధాను చేయకండి టీటీడీ అభ్యర్థన !
J.SURENDER KUMAR,
తిరుమల పుణ్యక్షేత్రంలో స్థానికులు, యాత్రికుల నీటి అవసరాలను తీర్చడానికి అంచనా వేయగా తక్కువ వర్షపాతం కారణంగా రాబోయే 120-130 రోజుల అవసరాలకు మాత్రమే సరిపోతుంది. టీటీడీ ప్రకటనలో పేర్కొంది. భక్తులు స్థానికులు నీటిని వృధా చేయవద్దని ప్రకటనలో టీటీడీ అభ్యర్థన చేసింది.
తిరుమలలోని ఐదు ప్రధాన డ్యామ్‌లలో లభ్యమయ్యే నీరు హిల్ టౌన్ వద్ద ఇప్పటివరకు.నీటి లభ్యత టీటీడీ అంచనా వేసింది.
తిరుమలలో ప్రతిరోజూ దాదాపు 43 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగిస్తున్నారు, అందులో 18 ఎల్‌జి తిరుమల డ్యామ్‌ల నుండి, మరియు మిగిలినవి తిరుపతిలోని కళ్యాణి డ్యామ్ నుండి సేకరించబడతాయి. తిరుమలలోని గోగర్భం, ఆకాశ గంగ, పాప వినాశనం, కుమారధార, పసుపుధార డ్యామ్‌ల మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 14,304 లక్షల గ్యాలన్లు కాగా, ప్రస్తుతం తిరుమలలో కేవలం 5800 లక్షల గ్యాలన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

👉అక్టోబరు 4 నుంచి 12 వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలను సందర్శించే అధిక సంఖ్యలో యాత్రికుల ప్రయోజనాల దృష్ట్యా, నీటి వృథాను అరికట్టాలని, అలాగే నీటి వినియోగాన్ని నియంత్రించేందుకు కొన్ని చర్యలు తీసుకోవాలని టిటిడి భక్తులతో పాటు స్థానికులకు విజ్ఞప్తి చేసింది.

రాబోయే కొద్ది నెలల్లో అసాధారణ పరిస్థితి కొనసాగితే. భక్తులతో పాటు స్థానికులు కూడా నీటిని అనవసరంగా వృధా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.