తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం ₹.125 కోట్ల రూపాయాలు !

J.SURENDER KUMAR,


తిరుమల శ్రీవారికి జూలై మాసంలో హుండీ ద్వారా ₹ 125.35 కోట్లు ఆదాయం వచ్చిందని తో దేవస్థానం ఈవో జే. శ్యామలరావు మీడియా సమావేశంలో తెలిపారు.

👉 జులై మాసం వివరాలు ఇలా ఉన్నాయి


దర్శనం చేసుకున్న యాత్రికుల సంఖ్య 22.13 లక్షలు, అమ్మిన శ్రీవారి లడ్డూల సంఖ్య 1.04 కోట్లు, అన్న ప్రసాదం భోజనం చేసిన భక్తుల సంఖ్య- 24.04 లక్షలు, టోన్సు రింగ్స్ సంఖ్య – 8.67 లక్షలు.


సుదూర ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తిరుమలలోని హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో పరిశుభ్రమైన, నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందించాలని టీటీడీ ఈవో శ్యామలరావు పునరుద్ఘాటించారు. డయల్ యువర్ ఈఓ కార్యక్రమం అనంతరం మీడియా ప్రతినిధులతో ఈఓ మాట్లాడుతూ యాత్రికుల ఆరోగ్య భద్రత, భద్రత కోసం తినుబండారాలలో పాటించాల్సిన పరిశుభ్రత అలవాట్లు, వంటలపై ఆహార భద్రత శాఖ హోటల్ సిబ్బందికి త్వరలో శిక్షణ ఇస్తుందని తెలిపారు. .

తిరుమలలోని హోటల్ యజమానులందరూ భద్రతా ప్రమాణాలతో హోటల్‌ను నడపాలంటే తప్పనిసరిగా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ సర్టిఫికేట్ పొందాలని ఆయన నొక్కి చెప్పారు.