J.SURENDER KUMAR,
తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం శ్రావణ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం శ్రావణ ఉపాకర్మ నిర్వహించారు.
ఇందులో భాగంగా శ్రీకృష్ణ స్వామిని ఊరేగింపుగా శ్రీ భూవరాహస్వామి ఆలయానికి తీసుకొచ్చి స్నపన తిరుమంజనం నిర్వహించారు.
అనంతరం స్వామివారికి నూతన యజ్ఞోపవీతాన్ని సమర్పించి ఆస్థానం నిర్వహించారు.
అనంతరం స్వామివారు ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ పీష్కార్ శ్రీహరి, అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.