తిరుమలలో కొన్ని ప్రత్యేక దర్శనాలు రద్దు !

J.SURENDER KUMAR,


అక్టోబర్ 3న అంకురార్పణతో అక్టోబర్ 4, 12 తేదీల్లో జరగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో కొన్ని ఆర్జిత సేవలు, దర్శనాలను టీటీడీ రద్దు చేసినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది.


తొమ్మిది రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలలో ఎక్కువ సంఖ్యలో యాత్రికులు సౌకర్యవంతమైన మరియు సంతృప్తికరమైన దర్శనాలను పొందేందుకు వీలుగా విఐపి బ్రేక్ దర్శనాలు (స్వయంగా  ప్రోటోకాల్ విఐపిల కు మాత్రమే అనుమతి) తో పాటు శిశువులు, సీనియర్ సిటిజన్లు మరియు శారీరక వికలాంగుల దర్శనాలతో సహా అన్ని ప్రత్యేక దర్శనాలను టిటిడి రద్దు చేసింది. ఈ మార్పులను భక్తులు గమనించి వార్షిక బ్రహ్మోత్సవాలు సజావుగా, విజయవంతంగా నిర్వహించేందుకు నిర్వాహకులకు సహకరించాలని టీటీడీ ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.


👉తిరుమలకు కోటి విరాళం !


కాకినాడలోని విరూపా పవర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన శ్రీ ప్రసన్న కోట బుధవారం రాత్రి ఎస్‌వన్న ప్రసాదం ట్రస్ట్‌కు ₹1,00,01,116/- విరాళం అందించారు.

అందుకు సంబంధించిన చెక్కును దాత తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలలోని అనంతర చాంబర్‌లో టీటీడీ అదనపు ఈవో  సిహెచ్‌ వెంకయ్య చౌదరికి అందజేశారు.